- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలుగు గోడల మధ్య కూర్చొని డిసైడ్ చేస్తే ఎట్లా?.. స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో కొత్త లొల్లి!
దిశ, ఆర్మూర్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆర్మూర్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఎంపిక సమావేశం

దిశ, ఆర్మూర్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆర్మూర్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఎంపిక సమావేశం ద్వారా లేదా.. పార్టీలో క్రీయా శీలక కార్యకర్తలను అభ్యర్థులుగా ప్రకటించారు. కానీ సీనియర్ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోకుండా.. సమావేశాలు పెట్టకుండా కేవలం నాలుగు గోడల మధ్య కూర్చొని టీపీసీసీకి పోటీ చేసే పేర్లను పంపించి సీనియర్ కార్యకర్తలను, నాయకులు ఆందోళనకు గురి చేస్తున్నారని మంథని మాజీ ఎంపీటీసీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వెంకట్రామ్ రెడ్డి (Venkatram Reddy) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులకు సోషల్ మీడియాలో రంగాల్లో పంచుకున్నారు. ఈ విషయాన్ని ఎవ్వరికీ బయటపడకుండా టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పెద్దలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
"ఒకవేళ అధిష్టానం దృష్టికి తీసుకెల్లకపోతే కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వెంకట్రామ్ రెడ్డి వాపోయారు. పదేళ్లు కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు సమావేశాన్ని నిర్వహించి వారి అభిప్రాయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం తీసుకోవాలని వెంకట్రామ్ రెడ్డి కోరారు. ఈ విషయాన్ని ఆర్మూర్ కాంగ్రెస్ సంబంధించి అన్ని గ్రూపులకు పంపించి పదేళ్లుగా పార్టీనీ కాపాడుకుంటూ వస్తున్న నిజమైన కార్యకర్తలను కాపాడుకుందాం" అంటూ పోస్ట్ చేశారు.






