- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో వీధి స్తంభాలకు విద్యుత్ బల్బులు అమరుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ మృతి చెందాడు.

దిశ, నాగిరెడ్డిపేట్ : విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో వీధి స్తంభాలకు విద్యుత్ బల్బులు అమరుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని చిన్న ఆత్మకూరు గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పెద్ద ఆత్మకూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ బాబా (35) అనే వ్యక్తి ఆత్మకూరు గ్రామపంచాయతీ లో మల్టీపర్పస్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. కాగా బాబా మంగళవారం సాయంత్రం చిన్న ఆత్మకూర్ గ్రామంలో విద్యుత్ స్తంభం పైకి ఎక్కి విద్యుత్ స్తంభానికి విద్యుత్ బల్బులు పెడుతుండగా, విద్యుత్ స్తంభం పైన 11 కెవి విద్యుత్ వైర్లు ఉండడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు తెలిపారు.
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం తో పాటు, గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బాబా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు మహమ్మద్ బాబా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపించారు. మృతునికి భార్య సబేర బేగం, 9 ఏళ్ల కుమారుడు అశ్వక్ లు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు.






