నా భార్య కనిపించడం లేదు సార్..

by Naveena |

బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అల్లెపు వెంకమ్మ కనబడుట లేదని కేసు నమోదు అయినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ శుక్రవారం తెలిపారు

నా భార్య కనిపించడం లేదు సార్..
X

దిశ, ఆర్మూర్ : బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అల్లెపు వెంకమ్మ కనబడుట లేదని కేసు నమోదు అయినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ శుక్రవారం తెలిపారు. తిమ్మాపూర్ లో వడ్డెర కులానికి చెందిన అల్లి వెంకమ్మ ఆమె భర్తతో కలిసి వారి కూతురు దగ్గరికి ఈనెల 5వ తేదీన జక్రాన్ పల్లి మండలం సికింద్రాబాద్ గ్రామానికి వెళ్లారు. తిరిగి వారు ఇంటికి వస్తుండగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తాలో ఆటో దిగి కనపడకుండా తప్పిపోయిందన్నారు. ఆమె భర్త నరసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు.

Next Story