- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ కథనానికి స్పందన.. పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ శ్రావణి
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ లో పాలన గాడిన పడేనా.. అనే కథనంతో బుధవారం ప్రచురితమైన దిశ కథనానికి

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ లో పాలన గాడిన పడేనా.. అనే కథనంతో బుధవారం ప్రచురితమైన దిశ కథనానికి ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ స్పందించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో బుధవారం ఉదయాన్నే పారిశుద్ధ్య పనులు చేసే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల వద్దకు చలిలో సైతం మున్సిపల్ కమిషనర్ పూజారి శ్రావణి వెళ్లారు. ఆర్మూర్ మున్సిపల్ లో డ్రైనేజీలు రోడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ ఆదేశించారు. ఆర్మూర్ పట్టణాన్ని చెత్త లేకుండా పరిశుభ్రమైన పట్టణంగా కార్మికులందరూ కంకణబద్దులే పనిచేస్తూ తయారు చేయాలన్నారు. మున్సిపల్ సానిటేషన్ అధికారులు పరిశుద్ధ కార్మికులను నిరంతరం పర్యవేక్షణ చేస్తూ పట్టణంలో చెత్త చెదారం లేకుండా, రోడ్లను డ్రైనేజీలను పరిశుభ్రంగా తయారు చేయాలన్నారు. ఆర్మూర్ మున్సిపల్ లో బుధవారం ఉదయం వివిధ వార్డులలో మున్సిపల్ కార్మికుల చేత జరిగే పారిశుధ్య పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. మున్సిపల్ కమిషనర్ పూజారి శ్రావణి వెంట సానిటరీ సూపర్ వైజర్ నరేందర్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి ఉన్నారు.






