- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముచ్చర్ల లో భానుడి భగ భగ..!
జిల్లాలో భానుడి భగభగలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏప్రిల్ నెలలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

దిశ, నందిపేట : జిల్లాలో భానుడి భగభగలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏప్రిల్ నెలలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలోని ఆలూరు మండలం మచ్చర్ల లో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు రాష్ట్రస్థాయిలో ఇది అత్యధికం కావడం గమనార్హం.
10 గంటలకే సెగలు..
ఉదయం 10 గంటలు దాటితే రోడ్లపై జనసంచారం తగ్గిపోతోంది. వడగాల్పులు తీవ్రంగా వీస్తుండటంతో కూలీలు, రైతులు, చిరు వ్యాపారులు పనిచేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాస్పిటల్స్‌లో వడదెబ్బ, డీహైడ్రేషన్ కేసులు పెరిగాయి. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి, పట్టణాల్లో కరెంట్ కోతలు ఇబ్బంది పెడుతున్నాయి.
జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో నమోదైన ఎండ తీవ్రత
ముచ్చర్ల : 43.2
భీంగల్ : 43.0
మోస్రా : 42.9
నిజామాబాద్ : 42.8
మంచిప్ప : 42.7
మల్కాపూర్ : 42.7
కోన సముందర్ ఆలూర్, పెర్కిట్: 42.7
మెండోరా, జక్రాన్ పల్లి, సిహెచ్ కొండూరు, తూంపల్లి, పోతంగల్: 42.6
మోర్తాడ్, గోపనపల్లి, తొండాకూరు, నిజామాబాద్ నార్త్, మదనపల్లి: 42.5
ఇస్సపల్లి, మగ్గిడి: 42.4 మగ్గిడి, వేల్పూర్, రేంజల్: 42.3
సాలూర, కోటగిరి, నవీపేట, ఏర్గట్ల: 42.2 ఎడపల్లి: 42.1
బాల్కొండ, కోరట్పల్లి: 42.0
లక్మాపూర్, కులాస్పూర్, ధర్పల్లి: 41.9
ప్రజలు పడుతున్న ఇబ్బందులు
1. ఆరోగ్య సమస్యలు: వడదెబ్బ, తలతిరగడం, వాంతులు, చర్మం కమిలిపోవడం సాధారణమైపోయింది. వృద్ధులు, పిల్లలపై ప్రభావం ఎక్కువ.
2. ఉపాధి దెబ్బ: భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, తోపుడు బండి వ్యాపారులు మధ్యాహ్నం పని చేయలేక రోజువారీ ఆదాయం కోల్పోతున్నారు.
3. వ్యవసాయ కష్టాలు: బోర్లు అడుగంటిపోవడం, మిడి వేడికి కూరగాయ పంటలు ఎండిపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు.
4. నీటి కటకట: చాలా గ్రామాల్లో రోజుకు ఒక్కసారే నీళ్లు వస్తున్నాయి. ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
♦ ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు.
♦ దాహం వేయకపోయినా ప్రతి గంటకు గ్లాసు మంచినీళ్లు తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ORS మంచిది.
♦ కారం, నూనె పదార్థాలు తగ్గించి తేలికైన ఆహారం తీసుకోవాలి. పుచ్చకాయ, కీరదోస లాంటివి తినాలి.
♦ వదులుగా ఉండే లేత రంగు కాటన్ బట్టలు వేసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు టోపీ, గొడుగు, కళ్లద్దాలు తప్పనిసరి.
♦ పిల్లలను ఎండలో ఆడుకోనివ్వవద్దు. వృద్ధులను, గర్భిణులను AC/ఫ్యాన్ కింద ఉంచాలి. కారులో పిల్లలను ఒంటరిగా వదలవద్దు.
వడదెబ్బ లక్షణాలు :
♦ విపరీతమైన చెమట లేదా చెమట పూర్తిగా ఆగిపోవడం, స్పృహ తప్పినట్టు ఉండటం కనిపిస్తే వెంటనే నీడకు తీసుకెళ్లి, తడిగుడ్డ వేసి 108కి కాల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.






