ఎంపీడీవో సాజిద్ అలీ సేవ‌లు అద్భుతం

by Nallavelli.Anjaneyulu |

తాడ్వాయి ఎంపీడీవో స‌య్య‌ద్ సాజిద్ అలీ సేవ‌లు అద్భుతం అని జ‌డ్పీ సీఈవో చంద‌ర్ నాయ‌క్ తెలిపారు. శ‌నివారం సాజిద్ అలీ ప‌ద‌వీ విర‌మ‌ణ మ‌హోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు.

ఎంపీడీవో సాజిద్ అలీ సేవ‌లు అద్భుతం
X

దిశ‌, తాడ్వాయి : తాడ్వాయి ఎంపీడీవో స‌య్య‌ద్ సాజిద్ అలీ సేవ‌లు అద్భుతం అని జ‌డ్పీ సీఈవో చంద‌ర్ నాయ‌క్ తెలిపారు. శ‌నివారం సాజిద్ అలీ ప‌ద‌వీ విర‌మ‌ణ మ‌హోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మండ‌ల కేంద్రంలోని మా గార్డెన్ లో ప‌ద‌వీ విర‌మ‌ణ మహోత్స‌వం కార్య‌క్ర‌మం క‌న్నుల‌పండుగ‌గా సాగింది. ముఖ్య అతిథిగా సీఈవో చంద‌ర్ నాయ‌క్ హాజ‌రై సాజిద్ అలీ దంప‌తుల‌ను స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా 39 సంవత్సరాల పాటు నిరంతరాయంగా, మచ్చలేని సేవలు అందించడం సామాన్యమైన విషయం కాదని కొనియాడారు. సాజిద్ అలీ పని చేసిన ప్రతి చోటా తనదైన ముద్ర వేశారని, ఆయన అనుభవం తోటి ఉద్యోగులకు మార్గదర్శకమని పేర్కొన్నారు. సన్మాన గ్రహీత సాజిద్ అలీ మాట్లాడుతూ...తన 39 ఏళ్ల వృత్తి ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, అధికారుల సహకారం, ప్రజల ఆదరణతో విజయవంతంగా బాధ్యతలు పూర్తి చేశానని భావోద్వేగానికి లోనయ్యారు. తన పదవీ విరమణ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, సాజిద్ అలీ కుటుంబ సభ్యులు, బంధువుమిత్రులు పాల్గొన్నారు.

Next Story