'ఉల్లాస్' అక్ష‌రాస్య‌త ప‌రీక్ష‌ల‌ను ఎంపీడీవో త‌నిఖీ

by Nallavelli.Anjaneyulu |

మండ‌ల ప‌రిధిలోని అన్ని గ్రామాల్లో ఆదివారం 'ఉల్లాస్' అక్షరాస్యత పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్ష కేంద్రాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ సందర్శించి తనిఖీ చేశారు.

ఉల్లాస్ అక్ష‌రాస్య‌త ప‌రీక్ష‌ల‌ను ఎంపీడీవో త‌నిఖీ
X

దిశ‌, క‌మ్మ‌ర్ ప‌ల్లి : మండ‌ల ప‌రిధిలోని అన్ని గ్రామాల్లో ఆదివారం 'ఉల్లాస్' అక్షరాస్యత పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్ష కేంద్రాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజ శ్రీనివాస్ సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వయోజన నిరక్షరాస్యలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఉల్లాస్ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వయోజన విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు అభ్యాసకుల నుండి మంచి స్పందన లభించింది. ఎంపీడీవో పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి, అభ్యాసకులు పరీక్ష రాస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. చదవడం, రాయడం, ప్రాథమిక అంకగణితంలో సామర్థ్యాన్ని పరీక్షించే ఈ పరీక్షలు విజయవంతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం గోపు కిరణ్, ఎంఈఓ ఆంధ్రయ్య, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Next Story