ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

by Kodari Anjali |

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
X

దిశ, ఆర్మూర్: ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్యు ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు డి నిఖిల్ నాయకులు వచ్చల లు మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున నీట్ పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. ఆ త్యాగాలను గుర్తు చేసుకుంటూ విద్యార్థులు విజయం సాధించామని ఒకవైపు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే, చేవెళ్ల బిజెపి పార్టీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విద్యార్థులను హేళన చేస్తూ విద్యార్థి ఉద్యమాన్ని అవహేళన చేసినట్టు మాట్లాడుతూ.. వేరే దేశాల్లో అయితే తుపాకులతో కలుస్తారు అనే మాట మాట్లాడడం సరైనది కాదన్నారు. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడిన మాట వెనక్కి తీసుకొని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని వారుడిమాండ్ చేశారు.

ఇటువంటి ఉద్యమాలు ఎంతోమంది..

అదే విధంగా ఈ దేశానికి విద్యార్థులు వెన్నుముక్క అని,నేటి బాలలే రేపటి పౌరులు చాలామంది ప్రముఖులు, రాజకీయ నాయకులు చెప్తా ఉంటారని అన్నారు. కానీ ఈ రోజుల్లో విద్యార్థి పోరాటానికి అవహేళన చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని.. అదే విధంగా విద్యార్థులు చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉందని, ఇటువంటి ఉద్యమాలు ఎంతోమంది విద్యార్థులు నిరుద్యోగులకు స్ఫూర్తి నింపుతుందన్నారు. విద్యార్థులు ఇటువంటి ఉద్యమాన్ని అవహేళన చేస్తూ మాట్లాడిన వారికి ఉద్యమంతోనే బుద్ధి చెప్పాలన్నారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు ఏరియా ప్రధాన కార్యదర్శి రాజు , కార్యదర్శి సిద్ధార్థ, ఏరియా మంగల్దీప్, ఆదిత్య , ఆనంద్, రూపక్, గోపాల్, మనోహర్ తతలు పాల్గొన్నారు.

Next Story