పిప్రి ఊరు మరో బెంగాల్ అవుతోంది: ఎంపీ ధర్మపురి అరవింద్

by Kodari Anjali |

పిప్రిలో 10 కుటుంబాలు ఉన్న ముస్లింలు ఇంత అరాచకానికి దిగితే హిందువులు ఏం చేస్తున్నారని జిల్లా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు.

పిప్రి ఊరు మరో బెంగాల్ అవుతోంది: ఎంపీ ధర్మపురి అరవింద్
X

దిశ, ఆర్మూర్: హిందువులంతా ఏకం కాకపోతే పిప్రి ఊరు మరో బెంగాల్ అవుతోందని పదివేల హిందూ కుటుంబాలు ఉన్న పిప్రి లో 10 కుటుంబాలు ఉన్న ముస్లింలు ఇంత అరాచకానికి దిగితే హిందువులు ఏం చేస్తున్నారని జిల్లా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో గత 10 రోజుల క్రితం అప్పు ఇచ్చి తిరిగి అడిగినందుకు రాజమల్లు ఇల్లుని నిప్పు పెట్టి దగ్ధం చేసిన సంఘటన విషయం తెలుసుకున్న ఎంపీ అరవింద్ మంగళవారం గ్రామానికి వెళ్లి ఇల్లును పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి ఆయన తన వంతుగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. పది వేల కుటుంబాలు ఉన్న గ్రామంలో ఒక ఉన్న ముస్లిం వ్యక్తి ఇంట్లో కుటుంబం మొత్తం ఉండగా ఇంట్లోకి పెట్రోల్ తీసుకువచ్చి పెట్రోల్ పోసి నిప్పు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. అలాగే గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు 25 లక్షల నష్టం జరిగితే 13 లక్షలు ఎలా ఇప్పిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలను గ్రామం నుండి వెళ్ళగొట్టకుండా ఇంకా ఊరిలోనే అంటిపెట్టుకొని ఉంచుకోవడం హిందువులకు మంచిది కాదని అన్నారు. ఇలాగే ముస్లింలను అక్కున చేర్చుకుంటే మరో బెంగాల్‌ను తయారు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story