- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి లేఖ రాసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి
రాబోయే గోదావరి పుష్కరాలు - 2027ను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని గోదావరి నది తీర ప్రాంతాల్లో ఉన్న ఘాట్‌ల వద్ద సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాబోయే గోదావరి పుష్కరాలు - 2027ను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని గోదావరి నది తీర ప్రాంతాల్లో ఉన్న ఘాట్‌ల వద్ద సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎంపీ అర్వింద్ లేఖ రాశారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో గోదావరి నదీతీర ప్రాంతాల్లో ఉన్న పుష్కర ఘాట్‌లకు కోట్లాది మంది భక్తులు పోటేత్తి వచ్చే అవకాశాలున్నాయని మంత్రికి పంపిన తన లేఖలో ఎంపీ పేర్కొన్నారు. ముఖ్యంగా కందకుర్తి, పోచంపాడ్, తడపాకల్, వాల్గొండ వంటి ప్రధాన ఘాట్‌ల వద్ద భారీగా భక్తుల రద్దీ ఉండనున్నందున ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా భక్తులకు అసౌకర్యం కలగని స్థాయిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఘాట్‌ల అభివృద్ధితో పాటు రహదారుల విస్తరణ, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్య సదుపాయాలు, పోలీస్ భద్రత, సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక సేవలు, విద్యుత్ సరఫరా, హైమాస్ట్ లైట్లు, వివిధ ప్రాంతాల నుండి ఘాట్ ల వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీటితో పాటు పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు వంటి అంశాలపై కూడా ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఎంపీ తన లేఖలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరారు. పుష్కరాల సమయంలో పుణ్య స్నానాల కోసం వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చేయాల్సిన ఏర్పాట్లకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేసి పనులను మిషన్ మోడ్‌లో పూర్తి చేయాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.






