- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో మామ, కోడలు మృతి
బైక్ అదుపుతప్పి కిందపడడంతో ప్రమాదం

X
దిశ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని దాస్ నగర్-మాక్లూర్ రోడ్డులో దుర్గా నగర్ తాండ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మామ, కోడలు మృతి చెందారు. నందిపేట మండలం తల్వేద గ్రామానికి చెందిన నీరడి చింటూ (30) తన భార్య పూజ (25) తండ్రి నారాయణతో కలిసి బైక్ పై నందిపేట్ నుండి మాక్లూరు మీదుగా నిజామాబాద్ వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో మాక్లూర్ - దాస్ నగర్ రోడ్డులో చింటూ నడుపుతున్న బైక్ అదుపు తప్పి కింద పడడంతో తీవ్రంగా గాయపడిన నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. చింటూ, పూజ గాయపడగా, వీరిని స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పూజ మృతి చెందింది. అదే ఆసుపత్రిలో చింటూ చికిత్స పొందుతున్నాడు. మాక్లూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






