- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొడుకు మందలించాడని కాలువలో దూకి తల్లి ఆత్మహత్య
by velandi.Saikiran |
కొడుకు మందలించడంతో మనస్థాపం చెందిన ఓ తల్లి.. కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన

X
దిశ, నాగిరెడ్డిపేట్ : కొడుకు మందలించడంతో మనస్థాపం చెందిన ఓ తల్లి.. కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.... మండలంలోని జలాల్ పూర్ గ్రామానికి చెందిన గూల్ల కిష్టవ్వ (65) అనే వృద్ధురాలు... తన కొడుకు గుల్ల నర్సింలు కుమారులను గత సోమవారం రాత్రి తిట్టిందన్నారు. దింతో గూల్ల కిష్టవ్వ ను ఆమె కొడుకు మందలించాడని వెల్లడించారు. ఈ తరుణంలోనే మనస్థాపం చెందిన కిష్టవ్వ... రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంట్లో నుండి వెళ్లిపోయి తిరిగి రాలేదన్నారు. గురువారం ఉదయం కిష్టవ్వ మృతదేహం పోచారం ప్రధాన కాలువలో కనిపించినట్లు స్పష్టం చేశారు. ఇక గూల్ల కిష్టవ్వ మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story






