గ్రామ పంచాయతీ ఆవరణలో వానర సైన్యం రౌడీయిజం

by Malleboina Mahesh |   (  Updated:2025-11-24 05:25:18  IST  )

సోషల్ మీడియాలో కోతుల బెడదపై ఓ యువకుడు పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ వీడియోలో యువకుడు మాట్లాడుతూ.. స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో గత కొన్ని రోజులుగా కోతుల గుంపు తిష్ట వేసింది.

గ్రామ పంచాయతీ ఆవరణలో వానర సైన్యం రౌడీయిజం
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో కోతుల బెడదపై ఓ యువకుడు పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ వీడియోలో యువకుడు మాట్లాడుతూ.. స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో గత కొన్ని రోజులుగా కోతుల గుంపు తిష్ట వేసింది. అటుగా వెళ్లే వారిపై కోతులు దాడులకు పాల్పుడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం, జోకోరా గ్రామ పంచాయతి పక్కనే మహిళా మండలి కార్యాలయం ఉంటుంది. దీంతో కోతుల గుంపు తిరుగాడటం కారణంగా మహిళలు అక్కడకు వెళ్లాలంటే బయపడుతున్నారు. పంచాయతీ కార్యాలయం వద్ద రోజూ గుంపులుగా చేరి అక్కడికి వచ్చే ప్రజలను కోతులు భయాందోళనకు గురిచేస్తున్నాయి.

ముఖ్యంగా పత్రాలు తీసుకువచ్చే వృద్ధులు, మహిళలు, పిల్లలపై కోతులు దాడి చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆ యువకుడు వీడియో లో తెలిపాడు. పలు రోజులుగా కొనసాగుతున్న ఈ సమస్యపై ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోకపోవడంతో స్థానిక ప్రజలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతుల ఆటంకంతో పంచాయతీ పనులు కూడా అంతరాయం కలుగుతున్నాయి. వెంటనే స్థానిక అధికారులతో పాటు, అటవీ శాఖ అధికారులు జోక్యం చేసుకుని కోతులను గ్రామం నుంచి తరలించే ప్రయత్నం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Next Story