- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మల్లిఖార్జున ఖర్గేతో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు భేటీ..!
కర్ణాటక రాష్ట్రంలోని కలబురగి (గుల్బర్గ)లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను వారి స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

దిశ, జుక్కల్/ నిజాంసాగర్ : కర్ణాటక రాష్ట్రంలోని కలబురగి (గుల్బర్గ)లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను వారి స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. కలబురగి పర్యటనలో భాగంగా ఖర్గేను కలిసి, పరస్పర ఆత్మీయ సంభాషణ జరిపారు. ఈ సందర్భంగా బుద్ధ పౌర్ణిమ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఖర్గే ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే హాజరై, కార్యక్రమంలో పాల్గొన్నారు. బుద్ధ పౌర్ణమి కార్యక్రమానికి హాజరై పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని.. అనిపించిందని సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందించేలా బుద్ధుని బోధనలు మార్గదర్శకంగా నిలుస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ భేటీ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ప్రజా సమస్యలు తదితర అంశాలపై కూడా చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఖర్గే వంటి జాతీయ నాయకుడిని కలుసుకోవడం తనకు గౌరవంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.






