- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యతోనే సర్వస్వం జయించవచ్చు : ఎమ్మెల్యే పోచారం
విద్యతోనే సర్వస్వం జయించవచ్చని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ షేక్ సలాం ఆధ్వర్యంలో వార్షికోత్సవం నిర్వహించారు.

దిశ, బాన్సువాడ : విద్యతోనే సర్వస్వం జయించవచ్చని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ షేక్ సలాం ఆధ్వర్యంలో వార్షికోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యతోనే అన్నీ జయించవచ్చని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాభివృద్ధికి పాటుపడుతున్నారని, విద్యా శాఖ వారి వద్దనే ఉందని అన్నారు. విద్యార్థులు క్రీడలతో పాటు, బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మేము కల్పిస్తామని, చదివించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది, తల్లిదండ్రులది అన్నారు. అలాగే బాగా చదవాల్సిన భాధ్యత మీదే అని అన్నారు. మంచిగా చదివి కుటుంబానికి బాసటగా నిలవాలని, మన ప్రాంతానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, కళాశాల ప్రిన్సిపాల్ సలాం,కృష్ణ రెడ్డి, కాలేజీ అభివృద్ధి కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్,మహమ్మద్ ఏజాజ్, పిట్ల శ్రీధర్, ఖాలెక్ పాల్గొన్నారు.






