ఆడంబ‌రాల‌కు పోయి ఆస్తులు అమ్ముకోవ‌ద్దు : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

ఆడంబ‌రాలకు పోయి.. అప్పుల పాలై ఆస్తులు అమ్ముకోవ‌ద్ద‌ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస‌రెడ్డి పేర్కొన్నారు.

ఆడంబ‌రాల‌కు పోయి ఆస్తులు అమ్ముకోవ‌ద్దు : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి
X

దిశ‌, బాన్సువాడ‌ : ఆడంబ‌రాలకు పోయి.. అప్పుల పాలై ఆస్తులు అమ్ముకోవ‌ద్ద‌ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస‌రెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ ప‌ట్ట‌ణంలో ఇవాళ బీర్కూర్, బాన్సువాడ మండ‌లాల‌కు చెందిన దాదాపు 96 మంది ల‌బ్దిదారుల‌కు క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, షాది ముబార‌క్ చెక్కుల‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా పోచారం మాట్లాడుతూ దేశంలో ఎక్క‌డ లేని విధంగా తెలంగాణ‌లో పేద ప్ర‌జ‌ల‌కు ఆర్థిక స‌హాయం అంద‌జేస్తున్నామ‌ని తెలిపారు. పేద కుటుంబాల‌కు పెళ్లి బారం కాకూడ‌ద‌ని.. కుటుంబాలు అప్పుల పాలు కావ‌ద్ద‌ని ప్ర‌భుత్వం ఆర్థిక స‌హాయం అంద‌జేస్తుంద‌ని తెలిపారు. ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం కోస ల‌బ్దిదారుల ఎంపిక పార‌ద‌ర్శ‌కంగా చేసి, స్థ‌లం లేని వారికి కూడా స్థ‌లం చూసి నిర్మించుకునే విధంగా ఏర్పాట్లు చేయ‌డానికి కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. ఏ ఒక్క‌రూ కూడా ఇల్లు లేని వారు మిగ‌ల‌కుండా చూస్తాన‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్ గంగాధ‌ర్, ఎంఎంసీ చైర్మ‌న్ శ్యామ‌ల, మోహ‌న్ నాయ‌క్, నార్ల సురేష్ పాల్గొన్నారు.

Next Story