ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి నిర‌స‌న సెగ‌..!

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, బాన్సువాడ : బాన్సువాడ‌ మండలంలోని బోర్లం గ్రామంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కి నిరసన సెగ తగిలింది. బోర్లంలో సీ.సీ. రోడ్డు, డ్రైనేజ్ పనుల భూమి పూజకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వెళ్ళారు.

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి నిర‌స‌న సెగ‌..!
X

దిశ‌, బాన్సువాడ : బాన్సువాడ‌ మండలంలోని బోర్లం గ్రామంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కి నిరసన సెగ తగిలింది. బోర్లంలో సీ.సీ. రోడ్డు, డ్రైనేజ్ పనుల భూమి పూజకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వెళ్ళారు. మీరు ఎ పార్టీలో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయాల‌ని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్ల‌కార్డులను ప్రదర్శించారు. ఎమ్మెల్యే పదవీ కి రాజీనామా చేయాలని నిరసన తెలిపారు. అంగ‌న్ వాడీ భవనం ఎప్పుడు పూర్తి చేస్తారో తెలపాలని ప్ల‌కార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సముదాయించే ప్రయత్నం చేసిన వినకపోవడంతో బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, బోడ చందర్, రమేష్ యాదవ్ పాల్గొన్నారు.

Next Story