ధాన్యం విష‌యంలో రైతులు జాగ్ర‌త్త‌లు పాటించాలి : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, బాన్సువాడ : ధాన్యం విష‌యంలో రైతులు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మంగ‌ళ‌వారం బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్ మండలం కిష్టాపూర్, చించోల్లి బాన్సువాడ

ధాన్యం విష‌యంలో రైతులు జాగ్ర‌త్త‌లు పాటించాలి : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ‌, బాన్సువాడ : ధాన్యం విష‌యంలో రైతులు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. మంగ‌ళ‌వారం బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్ మండలం కిష్టాపూర్, చించోల్లి బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. నియోజవర్గంలో రెండు రోజుల పాటు కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి డీఎస్ఓతో ఫోన్ లో మాట్లాడి లారీలకోసం ఎదురు చూడకుండా తూకం వేసిన ధాన్యం బస్తాలను వెంటనే ట్రాక్టర్లలో రైస్ మిల్లుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైస్ మిల్లర్లు సైతం రైస్ మిల్లు వద్ద వెంట వెంటనే ధాన్యం బస్తాలను దింపుకోవాలని రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని తెలిపారు. వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, రైతులు జాగ్రత్తగా ఉండాలని, తూకం వేసిన బస్తాలు, ధాన్యం రాశులపై పాలిథీన్‌ కాగితాలను కప్పుకోని వరి ధాన్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులు ఇబ్బంది పడకుండ ట్రాక్టర్లలో ధాన్యాన్ని తరలించే విషయంలో మిల్ల‌ర్లు కూడా అండగా ఉండాలని ఆదేశించారు.

Next Story