వరద బాధితులకు బ్రెడ్ - పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

by velandi.Saikiran |

వరద ప్రభావిత కొండాపూర్, నడిమి తాండ,ఎల్లాపూర్ తాండ, పళ్ళు గుట్ట తండా గ్రామాలలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పర్యటించారు.

వరద బాధితులకు బ్రెడ్ - పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
X

దిశ, రాజంపేట: ఎల్లారెడ్డి నియోజకవర్గం రాజంపేట మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలైన కొండాపూర్, నడిమి తాండ,ఎల్లాపూర్ తాండ, పళ్ళు గుట్ట తండా గ్రామాలలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పర్యటించారు. ఈ సందర్బంగా వరద బాధితులకు పండ్లు, బ్రెడ్ అందజేశారు. వరదలతో ధ్వంసమైన రోడ్స్, బ్రిడ్జి,పంట పొలాలను,ఇండ్లు ఎమ్మెల్యే మదన్ మోహన్ పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా అందర్నీ సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని ఆదేశించారు. వరద బాధితులందరికీ నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని తెలియజేశారు. అధికారులకు నష్టం అంచనావేసి నివేదిక అందించాలని సూచించారు. గత రెండు రోజులుగా సహాయక చర్యల్లో పాల్గొంటున్న కార్యకర్తలను అభినందించాడు.

Next Story