- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి : ఎమ్మెల్యే మదన్ మోహన్
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ పేర్కొన్నారు.

దిశ, ఎల్లారెడ్డి(తాడ్వాయి) : అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు కుల సంఘాల భవనాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ ల సంఘం రూ.5లక్షలు, నాయి బ్రాహ్మణ, ఆరె కటిక, గంగ పుత్ర సంఘాలకు రూ.3లక్షల చొప్పున నిధులను మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ ఇచ్చారు. వార్డులో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ పనుల్లో నాణ్యత పాటించాలని.. గడువులోపు పనులను పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ హయాంలోనే ఎల్లారెడ్డి పట్టణం అభివృద్ధి పథంలో నడుస్తోందని.. బస్టాండ్ ఆధునీకరణ, మినీ ట్యాంక్ బండ్ వంటి పనులతో రూపురేఖలు మారుస్తామని తెలిపారు.






