- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్‌పై మంత్రి సీతక్క విమర్శలు..
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీతక్క విమర్శలు గుప్పించింది.

దిశ, మాచారెడ్డి: సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీతక్క విమర్శలు గుప్పించింది. కామారెడ్డి జిల్లా ఉమ్మడి మాచారెడ్డి మండలంలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా యూరియా కొరత సృష్టిస్తున్నారన్నారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, పేదలకు ఇల్లు ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయాలని ఎన్నెన్నో కొత్త పథకాలు తీసుకువస్తుందన్నారు. మహిళా క్యాంటీన్లు, మహిళలకు బస్సులు, పెట్రోల్ బంకులు, ఇలా అనేకమైన పథకాలు తీసుకువచ్చి వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు.
ఇల్లు లేని పేదలకు ఇండ్లు, ఉచిత కరెంట్, 500 కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఫ్రీ బస్, పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. యూరియా అందించే బాధ్యత కేంద్రానిది. మేము కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి కొరత లేకుండా రైతులకు సరిపడా యూరియాను అందిస్తున్నామని చెప్పారు. కొందరు కులం పేరుతో రాజకీయాలు చేస్తూ మన మధ్య గొడవలు సృష్టిస్తున్నారు. దేవుడు గుడిలో ఉండాలి మతం భక్తి గుండెల్లో ఉండాలన్నారు.
కామారెడ్డి ప్రజలు ఇక ముందైనా సరైన నిర్ణయం తీసుకోవాలి.. సరైన నాయకున్ని ఎన్నుకోవాలని హితవు పలికారు. ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి ఒకరు అప్పటి ముఖ్యమంత్రి వారిద్దరినీ ఓడించి మూడో వ్యక్తిని ఎన్నుకుని కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్, మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు, మాచారెడ్డి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నౌసీలాల్ తదితరులు పాల్గొన్నారు.






