- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైక్రో ఫైనాన్స్ వేధింపులు...చిట్టిల వ్యాపారి సూసైడ్
మైక్రో ఫైనాన్స్ వేధింపుతో చిట్టిల వ్యాపారి సూసైడ్ చేసుకున్నాడు. హౌసింగ్ లోన్ కట్టకపోవడంతో ఇంటిని వేలం వేస్తామని మైక్రో

దిశ, భిక్కనూరు: మైక్రో ఫైనాన్స్ వేధింపుతో చిట్టిల వ్యాపారి సూసైడ్ చేసుకున్నాడు. హౌసింగ్ లోన్ కట్టకపోవడంతో ఇంటిని వేలం వేస్తామని మైక్రో ఫైనాన్స్ బెదిరించడంతో చిట్టిల వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం భిక్కనూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... మండల కేంద్రానికి చెందిన బండి రాజు (35) తన కిరాణా షాపు పెట్టుకొని, చిట్టీలు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గత కొంత కాలంగా అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మైక్రో ఫైనాన్స్ కు హౌసింగ్ లోన్ కూడా చెల్లించలేదు. దింతో ఇంటిని వేలం వేస్తామని బెదిరించారు మైక్రో ఫైనాన్స్ సిబ్బంది. ఇక చేసేదేమీ లేక చిట్టిల వ్యాపారి సూసైడ్ చేసుకున్నాడు. ఇక మృతునికి భార్య సుజాత, కుమార్తె కుమారుడు మనోజ్, కుమార్తె రిషిక ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.






