- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంకాపూర్ వృద్ధాశ్రమాల్లో వైద్య శిబిరం
by Ratna Kumari |
దిశ, ఆలూర్ : అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం 2025 సందర్భంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర సంస్థ ఆధ్వర్యంలో అంకాపూర్‌లోని పొద్దుటూరి సదానంద రెడ్డి వృద్ధాశ్రమం, లాలన వృద్ధా శ్రమం లో

X
దిశ, ఆలూర్ : అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం 2025 సందర్భంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర సంస్థ ఆధ్వర్యంలో అంకాపూర్‌లోని పొద్దుటూరి సదానంద రెడ్డి వృద్ధాశ్రమం, లాలన వృద్ధా శ్రమం లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు ఉచిత వైద్య పరీక్షలు, రక్తపోటు, షుగర్, హిమోగ్లోబిన్ తదితర మౌలిక పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించారు. అలాగే అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఆహార నియమాలు, వ్యాయామ పద్ధతులు, సంధివాతం సమస్యలపై వైద్యులు అవగాహన కల్పించారు. వృద్ధుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ నీలిమ, డాక్టర్ రక్షిత, ఎం.ఎల్.హెచ్.పి అంజలి, ఎం.ఎల్.హెచ్.పి వంశీ కృష్ణ, రాజ్యలక్ష్మి, చంద్రలేఖ,ఆశా కార్యకర్తలు అనూష, జ్యోతి, మేరీ పాల్గొన్నారు.
Next Story






