- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నియమం ఒక వైపు, ఆశ మరో వైపు..!
దిశ,తాడ్వాయి : సాధారణంగా పండుగంటేనే కోలాహలం.. విందు భోజనం. ముఖ్యంగా దసరా అంటే మాంస ప్రియులకు నైవేద్యం, మహావిందు

దిశ,తాడ్వాయి : సాధారణంగా పండుగంటేనే కోలాహలం.. విందు భోజనం. ముఖ్యంగా దసరా అంటే మాంస ప్రియులకు నైవేద్యం, మహావిందు తప్పనిసరి. ఈసారి దసరా పండుగ రోజునే గాంధీ జయంతి రావడంతో మాంస ప్రియులకు పెద్ద సవాల్ ఎదురైంది. గాంధీ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు పూర్తిగా మూసివేయాలనే ప్రభుత్వ నిబంధన... మాంస ప్రియులను ఒక రోజు ముందు రాత్రంతా నిద్ర లేకుండా చేసింది.
'డెడ్‌లైన్' ఫియర్...అర్ధరాత్రి దాటితే అంతే
అక్టోబరు 1న అర్ధరాత్రి 12 గంటల తర్వాత మాంసం అమ్మకాలకు అనుమతి ఉండదు. దీంతో... దసరా నాడు విందు ఏర్పాటు చేసుకోవాలనుకున్నవారు 'మిడ్‌నైట్ డెడ్‌లైన్' లోపు మాంసాన్ని కొనుగోలు చేయక తప్పని పరిస్థితి. ఫలితంగా.. తాడ్వాయి సెంటర్, బస్టాండ్ ప్రాంతంలోని మటన్ షాపుల వద్ద అక్టోబరు 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచే రద్దీ మొదలైంది. రాత్రి గంట గంటకు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. షాపుల ముందు కిక్కిరిసిన జనం క్యూ కట్టారు. ఈ క్యూలో నిలబడ్డవారు కేవలం సాధారణ జనం మాత్రమే కాదు,చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినవారూ ఉన్నారు.
మాంసం వీసా' తిరస్కరణ!
సరిగ్గా రాత్రి 11:59 నిమిషాలప్పుడు షాపు యజమానులు లెక్కలు కట్టడం ప్రారంభించారు. అర్ధరాత్రి 12 గంటల గంట మోగగానే... మాంసం దుకాణాలకు తాళాలు పడే అవకాశం ఉండడంతో క్యూలో ఉండి ఒక్క నిమిషం తేడాతో మాంసం దక్కాదేమో అన్న ఆందోళన లో మాంసం ప్రియురాలు ఉన్నారు. తమ 'మాంసం వీసా' తిరస్కరించబడుతుందో అనే బాధతో ఇదేం బాధ అని కలవరపడ్డారు. దసరా పండుగను ఘనంగా జరుపుకోవాలన్న ఆకాంక్ష,గాంధీ జయంతి నిబంధనను గౌరవించాలన్న తపన... రెండూ కలిసి మాంస ప్రియులను ఒక రోజు ముందు రాత్రి అలర్ట్‌గా, ఉండేలా చేశాయి.
వ్యాపారులకు కాసుల వర్షం
సాధారణంగా ఉదయాన్నే మూతపడే షాపులు, అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉంచాయి. "మా జీవితంలో ఇటువంటి వ్యాపారం ఎప్పుడూ చూడలేదు. కేవలం ఆరు గంటల్లోనే పది రోజుల అమ్మకాలు జరిగాయి.దసరా పండుగ,గాంధీ జయంతి రెండూ కలవడం మాకు 'బోనస్' లా మారింది,"అని ఓ మటన్ షాప్ యజమాని సంతోషం వ్యక్తం చేశారు.మొత్తంగా,గాంధీ జయంతి కారణంగా దసరా పండుగకు ఒక్క రోజు ముందు మాంస ప్రియులు పడిన తిప్పలు,అర్ధరాత్రి వరకు సాగిన వారి 'ఆఖరి గంటల పోరాటం'... తాడ్వాయిలో ఓ ఆసక్తికరమైన సంఘటనగా మిగిలిపోయింది.






