బీర్కూర్ లో భారీ చోరీ.. రూ.8ల‌క్ష‌లు విలువ గ‌ల బంగారం చోరీ..!

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, బాన్సువాడ : బీర్కూర్ మండ‌ల కేంద్రంలోని వైఎస్సార్ కాల‌నీలో గాండ్ల సంతోష్ అనే వ్య‌క్తి భారీ చోరీ జ‌రిగిన‌ట్టు పోలీసులు తెలిపారు. బాధితుడు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గుర్తు తెలియని వ్యక్తులు

బీర్కూర్ లో భారీ చోరీ.. రూ.8ల‌క్ష‌లు విలువ గ‌ల బంగారం చోరీ..!
X

దిశ‌, బాన్సువాడ : బీర్కూర్ మండ‌ల కేంద్రంలోని వైఎస్సార్ కాల‌నీలో గాండ్ల సంతోష్ అనే వ్య‌క్తి భారీ చోరీ జ‌రిగిన‌ట్టు పోలీసులు తెలిపారు. బాధితుడు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి ఇంట్లో దాచుకున్న నాలుగు తులాల బంగారం, రెండు లక్షల రూపాయలు చోరీ చేసిన‌ట్టు తెలిపారు. వెంటనే బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశారు. చోరీ సమాచారం అందుకున్న బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య , ఎస్ఐ మహేందర్ ఘటన స్థలానికి వెళ్లి చోరీ జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీమ్ వారు వేలిముద్రలు సేకరించారు. చోరీ జరిగిన తీరు చూస్తే తెలిసిన వారి పనే కావచ్చు అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Next Story