త్వరలో బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు

by velandi.Saikiran |

ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ లతో పాటు వివిధ సామాజిక వర్గాలకు చెందిన పలువురు త్వరలో బీఆర్ఎస్ లో

త్వరలో బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు
X

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ లతో పాటు వివిధ సామాజిక వర్గాలకు చెందిన పలువురు త్వరలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి చేరికలపై ఫోకస్ పెట్టిన విషయం విదితమే. ఇందులో భాగంగా ఇటీవల ఆలూరు మండలానికి చెందిన బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలు విజయభారతి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా త్వరలో బీసీ వర్గానికి చెందిన రాజశేఖర్ కూడా తన అనుచరులతో మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి సమక్షంలో బీ ఆర్ఎస్ లో చేరనున్నారు. బీఆర్ఎస్ లోకి చేరికల పరంపర పెరగడంతో ఆర్మూర్ గులాబీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది.

Next Story