అమ్మాయిల‌కు 18 సంవ‌త్స‌రాలు నిండ‌కుండా పెళ్లి చేయ‌డం నేరం : బాల‌ల ప‌రిర‌క్ష‌ణ అధికారి చైత‌న్య‌కుమార్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, ఆలూర్ : అమ్మాయిల‌కు 18 సంవ‌త్స‌రాలు నిండ‌కుండా పెళ్లి చేయ‌డం నేర‌మ‌ని జిల్లా బాల‌ల ప‌రిర‌క్ష‌ణ అధికారి చైత‌న్య‌కుమార్ తెలిపారు. ఆలూర్ మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలో బాల్య‌వివాహాల నిరోధం పై అవ‌

అమ్మాయిల‌కు 18 సంవ‌త్స‌రాలు నిండ‌కుండా పెళ్లి చేయ‌డం నేరం : బాల‌ల ప‌రిర‌క్ష‌ణ అధికారి చైత‌న్య‌కుమార్
X

దిశ‌, ఆలూర్ : అమ్మాయిల‌కు 18 సంవ‌త్స‌రాలు నిండ‌కుండా పెళ్లి చేయ‌డం నేర‌మ‌ని జిల్లా బాల‌ల ప‌రిర‌క్ష‌ణ అధికారి చైత‌న్య‌కుమార్ తెలిపారు. ఆలూర్ మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలో బాల్య‌వివాహాల నిరోధం పై అవ‌గాహ‌న స‌దస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయ‌న మాట్లాడుతూ బాల్య‌వివాహాల నిరోధ‌క చ‌ట్టం 2006 ప్ర‌కారం.. బాలుడికి 21, బాలిక కు 18 సంవ‌త్స‌రాలు నిండ‌క ముందు పెళ్లి చేయ‌డం నేర‌మ‌ని తెలిపారు. ఒక‌వేళ అలాంటి వివాహం జ‌రిపించినా.. లేదా ప్రోత్స‌హించిన వారికి రెండేళ్లు జైలు శిక్ష లేదా ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు జ‌రిమానా విధిస్తార‌ని, అలాగే బెయిల్ కూడా ల‌భించద‌ని తెలిపారు. ప్ర‌భుత్వం ఈ చ‌ట్టం కింద బాల్య వివాహాల నిషేద అధికారుల‌ను ప్ర‌త్యేకంగా నియ‌మించింద‌ని తెలిపారు.


ఎంపీడీవో గంగాధ‌ర్ మాట్లాడుతూ బాల్యవివాహాలు సామాజికంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా తీవ్ర దుష్పరిణామాలకు దారితీస్తాయని తెలిపారు. చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల తల్లి–శిశు మరణాలు పెరుగుతాయని తెలిపారు. పౌషికాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలు కూడా ఎక్కువగా తలెత్తుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూప‌ర్ వైజ‌ర్ సమతా, ఎంపీఓ రాజలింగం, పంచాయతీ కార్యదర్శులు చంద్రశేఖర్, నవీన్, నసీర్, దినేష్, కిషోర్, నాగేంద్రబాబు, రానా తరుణం, వందన పాల్గొన్నారు.

Next Story