- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇప్ప పువ్వుకు మార్కెట్ అవకాశాలు పెరుగుతాయి
దేశ ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మహువ (ఇప్ప) పువ్వుతో తయారు చేసిన ఆహారపదార్థాలు, స్వీట్ల గురించి ప్రస్తావించారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ మార్చి30: దేశ ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మహువ (ఇప్ప) పువ్వుతో తయారు చేసిన ఆహారపదార్థాలు, స్వీట్ల గురించి ప్రస్తావించారు. దీంతో ఇకపై మహువ (ఇప్ప) పువ్వుకు గణనీయమైన డిమాండ్ పెరుగుతుందని, మార్కెట్ బాగా ఉంటుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. ఆదివారం ఆయన నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మన్ కీ బాత్ ప్రత్యక్ష ప్రసారాన్ని బీజేపీ నేతలతో కలిసి వీక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్ల యొక్క అద్భుత ప్రయత్నాన్ని ప్రస్తావించిన విషయాన్ని ధన్ పాల్ ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు మహువ (ఇప్ప) పువ్వును ఉపయోగించి రుచికరమైన ఆహార పదార్థాలు, స్వీట్లు తయారుచేయడాన్ని ప్రధాని ప్రత్యేకంగా మన్ కీ బాత్ లో ప్రస్తావించడాన్ని గొప్ప విషయంగా అభివర్ణించారు. ఆదివాసీ సంప్రదాయానికి ఆధునికతను జోడించి , ఈ సంప్రదాయ పుష్పానికి కొత్త ఉపయోగాలను కనుగొనడం అద్భుతమని ఎమ్మెల్యే ధన్ పాల్ అన్నారు. ఇద్దరు అక్కాచెల్లెళ్ల ప్రయత్నం కారణంగా మహువ (ఇప్ప) పువ్వుకు రానున్న రోజుల్లో కొత్తగా మార్కెట్ అవకాశాలు పెరుగుతాయన్నారు. ఇది ఆదివాసీ సముదాయాలకు ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా గొప్ప మార్గాన్ని చూపిస్తుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మండల అధ్యక్షులు, తాజా మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.






