- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టు ఎర్ర గొల్ల రవి ఎక్కడ..?
దిశ, మాచారెడ్డి : మావోయిస్టు ఉద్యమం లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉమ్మడి మాచారెడ్డి మండలం

దిశ, మాచారెడ్డి : మావోయిస్టు ఉద్యమం లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉమ్మడి మాచారెడ్డి మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ లొంగుబాటు, అరెస్టు అంశం కామారెడ్డి జిల్లా లో చర్చనీయాంశమైంది. దండకారణ్యం లో డివిజన్ కమిటీ స్థాయిలో పని చేస్తున్న ఎర్రగొల్ల రవి మావోయిస్టు పార్టీ లో జరుగుతున్న పరిణామాల్లో ఉన్నాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ కగార్ తో కకావికలమవుతున్న తరుణం లో ఎర్రగొల్ల రవి ఆచూకీ పై సందిగ్ధత నెలకొంది. 2001 లో ఇంటర్మీడియట్ చదువుతున్న క్రమం లో అజ్ఞాతం లోకి వెళ్లిన రవి ఇంటి ముఖం చూడలేదు. ఆయన ఎలా ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు. పోలీసుల దాడిలో ఆరెపల్లి లో అతని ఇంట్లో టెన్త్ మెమో పై ఉన్న ఫొటో ను పోలీసులు తీసుకెళ్లిందే ఆనవాలు. లొంగిపోవాలని రవి తండ్రి రామయ్య , తల్లి భూమవ్వ లు పలుమార్లు మాద్యమాల ద్వారా కోరారు. అయినా రాకపోగా తల్లి తనువు చాలించారు. జిల్లాలో చర్చనీయాంశమైన రవి గురించి అతని అన్న మల్లేష్ ను, పోలీసులను వివరణ కోరగా ఎవరికి ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ, ఒడిషా సరిహద్దుల్లో ఇటీవల వరుస లొంగుబాట్లు, అరెస్టులు, ఎన్కౌంటర్ల నేపథ్యంలో రవి అలియాస్ సంతోష్ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారా లొంగిపోయిన వారిలో ఉన్నారా అనే చర్చ జరుగుతుంది.






