చెట్టుకు ఆటో ఢీకొని వ్యక్తి మృతి

by velandi.Saikiran |

మండలంలోని బట్టాపూర్ శివారు, తొర్తి క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు

చెట్టుకు ఆటో ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, ఏర్గట్ల : మండలంలోని బట్టాపూర్ శివారు, తొర్తి క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏర్గట్ల నుండి నిర్మల్ వైపు వెళ్తున్న AP01X7741 నంబర్ ఆటో అదుపుతప్పి చెట్టుకు ఢీకొని పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ఘటనలో నిర్మల్ పట్టణానికి చెందిన పోగుల సత్యనారాయణ (48) తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి మృతదేహానికి శవపంచనామ నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ పడాల రాజేశ్వర్ తెలిపారు.

Next Story