కీచక డాక్టర్లు.. ‘నాతో ఎఫైర్ పెట్టుకో..’ అంటూ మహిళా స్టాఫ్‌పై ఒత్తిడి.. వీడియో కాల్స్‌తో..

by Batti.Sumithra |   (  Updated:2025-11-05 06:40:55  IST  )

డాక్టర్ అంటే ప్రజల్లో ప్రత్యేకమైన గౌరవభావం, పూజ్యభావం ఉందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కీచక డాక్టర్లు.. ‘నాతో ఎఫైర్ పెట్టుకో..’ అంటూ మహిళా స్టాఫ్‌పై ఒత్తిడి.. వీడియో కాల్స్‌తో..
X

డాక్టర్ అంటే ప్రజల్లో ప్రత్యేకమైన గౌరవభావం, పూజ్యభావం ఉందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డాక్టర్లు ప్రాణాలు కాపాడే దేవుళ్లు, కనిపించే ప్రత్యక్ష దైవాలుగా జనం భావిస్తారు. డాక్టర్లను, డాక్టర్ వృత్తిని ఎంతో గౌరవిస్తారు. కానీ, తనను దేవుడిగా భావించే పేషంట్లను, మహిళలను కొందరు డాక్టర్లు వక్రబుద్ధితో చూస్తున్నారు. వారిపట్ల కామ వాంఛను ప్రదర్శిస్తున్నారు. తమ వృత్తిని అడ్డుపెట్టుకొని, మహిళలను భయపెట్టి, ప్రలోభపెట్టి లొంగదీసుకుంటున్నారు. వారితో శారీరక సంబంధాలు కొనసాగిస్తూ మహిళల జీవితాలు నాశనమయ్యేలా చేస్తున్నారు. పెళ్లికాని అమ్మాయిలతో పాటు, సంసార జీవనం కొనసాగిస్తున్న వివాహిత మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. వీరిలో కొంత మందిని పలువురు డాక్టర్లు వారితో మహిళలు చనువుగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలను రహస్యంగా తీసి వాటిని చూపుతూ తమ అక్రమ సంబంధాన్ని కంటిన్యూ చేసేలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలుస్తోంది. కొందరు డాక్టర్లు తమ వద్ద పనిచేసే ఫీమేల్ స్టాఫ్ ఆర్థిక, సామాజిక, మానసిక బలహీనతలను సొమ్ము చేసుకుని వారితో ఇల్లీగల్ రిలేషన్ షిప్ ని కంటిన్యూ చేస్తున్నారు. తప్పని తెలుసుకుని తప్పుకుందామన్నా తప్పించుకోకుండా ఉండేందుకు కొందరు బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలుస్తోంది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో ఫీమేల్ నర్స్ గా పనిచేస్తున్న ఓ అమ్మాయికి ఆ హాస్పిటల్ డాక్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఇటీవల తను తన బాయ్ ఫ్రెండ్ కు విషయాన్ని చెప్పడంతో ఆయన తనకు తెలిసిన ఓ జర్నలిస్టుకు విషయాన్ని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సదరు డాక్టరు చెందిన హాస్పిటల్ లో పనిచేస్తున్న ఫీమేల్ స్టాఫ్ ను ఏదో రకంగా లొంగదీసుకుని శారీరకంగా అనుభవిస్తున్నాడని, వారితో అక్రమసంబంధాన్ని కొనసాగిస్తూ మానసిక వేధింపులకు గురిచేస్తున్నట్లు జర్నలిస్టుతో నర్స్ బాయ్ ఫ్రెండ్ తెలిపినట్లు సమాచారం.

దీంతో సదరు జర్నలిస్టు డాక్టర్ ను కలిసి డాక్టర్ లైంగిక వేధింపులకు సంబంధించి తన దగ్గర ఆధారాలున్నాయని, భయపెట్టి మీడియాలో కవర్ చేస్తానని బెదిరించినట్లు తెలిసింది. దీంతో తన రాసలీలల బాగోతం మీడియాలో వస్తే ఎక్కడ తన పరువుపోతుందో, బాగా నడిచే తన మెడికల్ ప్రాక్టీస్ ఎక్కడ ప్రమాదంలో పడుతుందోనని భయపడి పెద్ద మొత్తంలో క్యాష్ డీల్ సెటిల్మెంట్ చేసుకోవడంతో విషయం అక్కడే ఆగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.

బయట పడ్డ డెంటల్ డాక్టర్ బండారం..

తాజాగా ఓ డెంటల్ డాక్టర్ ఓ వివాహితను వీడియో కాల్ చేస్తూ రెండేళ్లుగా లైంగికంగా వేధించిన ఘటన నిజామాబాద్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు నేరుగా సీపీ సాయిచైతన్యను కలిసి ఫిర్యాదు చేసింది. నగరంలోని ఓ డెంటల్ డాక్టర్ తో పాటు, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇద్దరు తనను ఫోన్లు చేస్తూ, వీడియో కాల్స్ చేస్తూ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని, రూ. 10 వేలిస్తాను తనతో ఓ రాత్రి గడపాలని ఫోన్ చేసి బలవంత పెడుతున్నారని వాపోయింది. తనతో గడిపితే అన్నిరకాల సుఖాలను సొంతం చేస్తామని ఇద్దరు తనకు వేర్వేరుగా ఫోన్లు చేస్తూ తరచూ వేధిస్తున్నారంటూ సీపీ ఎదుట బాధితురాలు కన్నీరుమున్నీరైనట్లు తెలిసింది.

తాను గతంలో ఓ ట్రావెల్స్ లో పనిచేస్తున్నప్పుడు సదరు డెంటల్ డాక్టర్ పాస్ పోర్టు కోసం వచ్చారని, అప్పుడు తన ఫోన్ నెంబర్ తీసుకుని వేధిస్తున్నాడంటూ వాపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా పాస్ పోర్టు కోసమే వచ్చి తన ఫోన్ నెంబర్ తీసుకున్నట్లు, అప్పటి నుంచి తనను వేధిస్తున్నారని బాధితురాలు సీపీకి తెలిపింది. దీంతో సీపీ సీరియస్ గా స్పందించి నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ శ్రీకాంత్ కు ఫోన్ చేసి కేసు విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కేసులో నిందితులు డెంటల్ డాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారిపై వివిధ సెక్షన్లతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఫోర్త్ టౌన్ ఎస్ ఐ శ్రీకాంత్ మీడియాకు వివరించారు.

బయటపడాల్సిన డాక్టర్లు ఇంకెందరో..

దొరికేవరకు అందరూ దొరలే.. సత్తెపూసలే అనే నానుడి నిజమేనండోయ్.. ఇప్పటి వరకు నగరంలో ఓ ప్రముఖ డెంటల్ డాక్టర్ గా పేరు సంపాదించుకున్న డాక్టర్ వ్యవహారం పై ఆర్యనగర్ లో నివాసముంటున్న ఓ బాధిత మహిళ ధైర్యంగా బయటికి వచ్చి తనను లైంగిక వేధింపులకు గురి చేసిన డాక్టర్ విషయం బయటపెట్టడంతో ఆయన బండారం బయట పడింది. కానీ, నగరంలో ఎందరో డాక్టర్లు ఇంకా బయట పడకుండా దర్జాగా పెద్దమనుషులుగా చలామణి అవుతూ ఫోజులు కొడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా తన దగ్గరకు వస్తున్న మహిళా పేషంట్లను కూడా మత్తు ఇంజక్షన్లు ఇచ్చి శారీరకంగా అనుభవిస్తున్నారు.

తమ కామవాంఛకు అమాయక పేషంట్లను బలిచేస్తున్నారు. విషయం తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొందరు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది నెలల క్రితం డిచ్ పల్లి నియోజకవర్గానికి చెందిన ఓ ఆర్ఎంపీ డాక్టర్ తన వద్దకు వచ్చే మహిళా పేషంట్లతో అనుచితంగా ప్రవర్తిస్తూ , ఆయన చేసే కామ క్రీడలను ఓ మహిళ ఏకరువు పెట్టింది. ఆర్ఎంపీ డాక్టర్లు తమ హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న సదరు ఆర్ ఎం పీ డాక్టర్ ను బాధిత మహిళ ర్యాలీలో నుండి లాగి చెప్పుతో కొట్టి సంచలనంగా నిలిచింది. సదరు డాక్టర్ చేసిన అసాంఘీక కార్యకలాలపాల గురించి బయటి ప్రపంచానికి వివరించింది.

బాధిత మహిళలూ బయటపడండి.. అమాయక మహిళను కాపాడండి..

డాక్టర్లతో లైంగిక వేధింపులను ఎదుర్కొంటూ మానసిక, శారీరక వేధింపులకు గురైన బాధిత మహిళలు ఇప్పటికైనా, సమాజ హితం కోసం, అమాయక మహిళల రక్షణ కోసం బయటికి వచ్చి నిజాలను వెల్లడించాలని పలువురు కోరుతున్నారు. బాధిత మహిళలకు అండగా ఉండే నిజాయితీ కలిగిన సీపీ పోతరాజు సాయిచైతన్య ఉండగా ఏ బాధిత మహిళ బయపడాల్సిన అవసరం లేదని, బాధిత మహిళ గుర్తింపును కూడా పోలీసులు బయటపెట్టకుండా జాగ్రత్త పడతారని మహిళలు గమనించి ముందుకు రావాలని కోరుతున్నారు. డాక్టర్ల ముసుగులో కామ వాంఛతో మహిళలను వేధించే వారిని ఉపేక్షిస్తే సమాజానికి తీవ్ర ప్రమాదమని నగర మహిళలు అంటున్నారు.

Next Story