జీవితం పై విర‌క్తి తో రైలు కింద‌ప‌డి ప్రేమికుడి ఆత్మ‌హ‌త్య

by Ratna Kumari |

ప్రేమించిన యువతితో తలెత్తిన గొడవల కారణంగా డోల అనిల్ (29) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం నిజామాబాద్ లో చోటు చేసుకుంది.

జీవితం పై విర‌క్తి తో రైలు కింద‌ప‌డి ప్రేమికుడి ఆత్మ‌హ‌త్య
X

దిశ, నిజామాబాద్ అర్బన్ : ప్రేమించిన యువతితో తలెత్తిన గొడవల కారణంగా డోల అనిల్ (29) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం నిజామాబాద్ లో చోటు చేసుకుంది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ SHO సాయిరెడ్డి వెల్లడించిన ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని హమాల్వాడీ ప్రాంతానికి చెందిన లక్ష్మీపతి కుమారుడు అనిల్ ఓ యువ‌తిని ప్రేమించాడు. అయితే ప్రేమించిన యువతితో గత కొద్ది రోజులుగా ప్రేమ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంపై నగరంలోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో ఇద్దరికీ కౌన్సిలింగ్ కూడా జరుగుతోంది. కౌన్సిలింగ్ లో కూడా వీరి గొడవ ఇంకా కొలిక్కి రాకపోవడంతో మనస్థాపం చెందిన అనిల్ ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని కుంగుబాటుకు గురయ్యాడని, జీవితంపై విరక్తి చెందిన అనిల్ పట్టాలపై పరుగులు తీస్తున్న కరీంనగర్ డెమో ట్రైన్ కుఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ హెచ్ ఓ సాయిరెడ్డి మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించినట్టు SHO సాయిరెడ్డి తెలిపారు.

Next Story