నిమజ్జనంలో అపశృతి..ట్రాలీని ఢీకొట్టిన‌ లారీ

by velandi.Saikiran |

గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. గణపతి నిమజ్జనం కోసం ట్రాలీ ట్రాక్టర్ ను తీసుకెళ్తుండగా లారీ ఢీకొన్న ఘటనలో న

నిమజ్జనంలో అపశృతి..ట్రాలీని ఢీకొట్టిన‌ లారీ
X

దిశ, కామారెడ్డి : గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. గణపతి నిమజ్జనం కోసం ట్రాలీ ట్రాక్టర్ ను తీసుకెళ్తుండగా లారీ ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జాతీయ రహదారిపై క్యాసంపల్లి శివారులో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. దోమకొండకు చెందిన యువకులు రామారెడ్డి నుంచి గణపతి ట్రాలీని తీసుకుని వెళ్తున్నారు. ట్రాక్టర్ ఇంజన్ పై నలుగురు యువకులు కూర్చున్నారు. ట్రాలీ బైపాస్ రోడ్డుపై క్యాసంపల్లి శివారులోకి రాగానే వెనుక నుంచి వస్తున్న గుర్తు తెలియని లారీ... ట్రాక్టర్ ట్రాలీని ఢీకొంది. ఈ ఘటనలో ట్రాక్టర్ ఇంజన్ పై కూర్చున్న నలుగురికి గాయాలయ్యాయి. దోమకొండకు చెందిన సాయికుమార్, శ్రీధర్ లతో పాటు ట్రాక్టర్ నడుపుతున్న రాజయ్యకు గాయాలయ్యాయి. ఇందులో శ్రీధర్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ రిఫర్ చేసారు. మరొక యువకుడిని సైతం నిజామాబాద్ కు రిఫర్ చేసినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story