- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక ఎన్నికలు.. ఇంటింటికీ మటన్, చికెన్
పంచాయతీ ఎన్నికల ముంగిట పల్లెల్లో రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. గ్రామాల్లో చిత్ర, విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. సర్పంచ్ పీఠమెక్కేందుకు ఆశావహులు విభిన్న ప్రయత్నాలు చేస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల ముంగిట పల్లెల్లో రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. గ్రామాల్లో చిత్ర, విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. సర్పంచ్ పీఠమెక్కేందుకు ఆశావహులు విభిన్న ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉండగా, మిగతా వాళ్లు తిప్పలు పడుతున్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం కావడంతో పలువురు సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులు కూడా పోటీపడి చికెన్, మటన్ పార్శిళ్లు ఇంటింటికి పంచారు. ఇంకొందరు ఏకంగా మేకలను కోసి ఇంటింటికి అందజేశారు. సర్పంచ్ పదవి దక్కించుకోవాలనే పంతంతో ఎంతైనా ఖర్చు పెట్టడానికి అభ్యర్థులు వెనకడుగు వేయడం లేదు. పొద్దున నుండి ర్యాలీలో పాల్గొని ప్రచారం నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంత వాసులు, ఆ తర్వాత కూలీ పనులకు పోతున్నారు. సాయంత్రం రాగానే మళ్లీ ఓ రౌండ్ ప్రచారంలో పాల్గొంటున్నారు. మరికొన్ని గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు పొద్దటి నుంచే టిఫిన్లు, బిర్యానీలు తయారు చేస్తున్నారు. పోటాపోటీగా నడుస్తున్న దావత్ లతో పల్లెలో ఖుషీ అవుతున్నారు. ఎక్కువ ఓట్లు ఇంటి వాళ్లకు మస్తు డిమాండ్ ఉంటుంది. గ్రామాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు, జెండాలతో హడావుడి పెరిగింగింది.
దిశ, కామారెడ్డి: పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పలు రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఆదివారం కావడంతో పలువురు సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులు కూడా పోటీపడి చికెన్, మటన్ పార్శిళ్లు ఇంటింటికి పంచారు. ఇంకొందరు ఏకంగా మేకలను కోసి ఇంటింటికి అందజేశారు.
పల్లెల్లో మందు, విందు జోరు..
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు జీపీ ఎన్నికల వేల అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. ఒకరికి మించి ఒకరు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తాయిలాలు అందిస్తున్నారు. అందులోనూ ఎన్నికల వేళ ఆదివారం మర్యాదలు జోరుగా సాగాయి. కామారెడ్డి డివిజన్ లోని మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న పలు గ్రామాల్లో ఇంటింటికి చికెన్, మటన్, మద్యం పంపిణీ జోరుగా జరుగుతుంది. సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఖర్చుకు వెనకాడడం లేదు. వార్డు సభ్యులుగా తగ్గేది లేదని పోటీ పడి ఖర్చు చేస్తున్నారు.
ఉదయం చికెన్, సాయంత్రం మటన్
ఓటర్లకు తాయిలల్లో భాగంగా పలు గ్రామాల్లో ఆదివారం ప్రతి ఇంటికి ఉదయం చికెన్, సాయంత్రం మటన్, మద్యం పంపిణీ చేశారు. కామారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో తనకే ఓటు వేస్తామని ఓ వర్గం మొత్తం ఒప్పందం చేసుకోవడంతో సంతోషంలో ఓ అభ్యర్థి ఏకంగా రెండు మేకలు కోసి దావత్ ఇచ్చాడు. మరో గ్రామంలో ప్రతి ఇంటికి ఉదయం అరకిలో చికెన్ చొప్పున పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు పంపిణీ చేశారు. సాయంత్రం మందు కూడా అందజేశారని తెలిసింది. ఎన్నికల వేళ ఆదివారం రావడంతో మర్యాదలు మరింతగా పెరిగాయి. మిగతా రోజుల్లో కూడా నిత్యం మద్యం పంపిణీ జోరుగా కొనసాగుతోంది.
- Tags
- Local elections






