నత్త నడకన మద్యం షాపుల దరఖాస్తుల ప్రక్రియ

by Ajay Maddhiboyina |

మద్యం దుకాణాల లీజు కాలానికి నిర్వహిస్తున్న దరఖాస్తుల ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. సెప్టెంబర్ 26నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు కేవలం జిల్లాలోని వివిధ స్టేషన్ల పరిధిలోని 31షాపులకు బుధవారం వరకు 45 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.

నత్త నడకన మద్యం షాపుల దరఖాస్తుల ప్రక్రియ
X

మద్యం దుకాణాల లీజు కాలానికి నిర్వహిస్తున్న దరఖాస్తుల ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. సెప్టెంబర్ 26నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు కేవలం జిల్లాలోని వివిధ స్టేషన్ల పరిధిలోని 31షాపులకు బుధవారం వరకు 45 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 102 మద్యం షాపులకు లీజు కాలానికి దరఖాస్తుల ప్రక్రియ చాలా స్లోగా కొనసాగుతోంది. 2023-2025 లీజు కాలానికి 4వేల పైచిలుకు దరఖాస్తులు రాగా, ఈసారి అంతకన్నా ఎక్కువగా వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ వ్యాపారులు చాలామంది దరఖాస్తు చేయడానికి ముందుకు రావడం లేదు. దరఖాస్తుల ప్రక్రియకు ఈ నెల 18వరకు గడువు ఉండడంతో చివరి వరకు వేచి ఉండే ధోరణితో కొందరు వ్యాపారులు ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గడువు ముగిసే మూడు నాలుగు రోజుల్లో దరఖాస్తుదారుల తాకిడి విపరీతంగా ఉంటుందని, ఎప్పటిలాగే ఈసారి కూడా అలాంటి పరిస్థితే ఉంటుందని అధికారులు చెపుతున్నారు.

- దిశ ప్రతినిధి, నిజామాబాద్

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా వ్యాప్తంగా 102 మద్యం షాపులకు 2025-27 వరకు లీజు కాలానికి నిర్వహిస్తున్న దరఖాస్తుల ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. సెప్టెంబర్ 26 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు కేవలం జిల్లాలోని వివిధ స్టేషన్ల పరిధిలోని 31షాపులకు బుధవారం వరకు 45దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దరఖాస్తుల ప్రక్రియ చాలా స్లోగా కొనసాగుతోంది. 2023-2025 లీజు కాలానికి 4వేల పైచిలుకు దరఖాస్తులు రాగా, ఈసారి అంతకన్నా ఎక్కువగా వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ వ్యాపారులు చాలా దరఖాస్తు చేయడానికి ముందుకు రావడం లేదు. దరఖాస్తుల ప్రక్రియకు ఇంకా ఈ నెల 18వరకు గడువు ఉండడంతో చివరి వరకు వేచి ఉండే ధోరణితో కొందరు వ్యాపారులు ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గడువు ముగిసే మూడు నాలుగు రోజుల్లో దరఖాస్తుదారుల తాకిడి విపరీతంగా ఉంటుందని, ఎప్పటిలాగే ఈసారి కూడా అలాంటి పరిస్థితే ఉంటుందని అధికారులు చెపుతున్నారు.

భారంగా మారిన రూ.3లక్షల ఫీజు..

మద్యం షాపుల కోసం దరఖాస్తుదారుడు టెండర్ ఫీజు రూ.3లక్షలు (నాన్ రిఫండబుల్) చెల్లించాల్సి రావడం కొంతమందికి భారంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డ్రా పద్ధతిలో కేటాయించే షాపులు ఒకవేళ డ్రాలో దక్కకపోతే ఫీజు కింద చెల్లించిన రూ.3లక్షలు నష్టపోవాల్సి వస్తోందనే అభిప్రాయంతో చాలామంది దరఖాస్తు చేయడానికి వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఇదే కారణంతో ఆలోచించుకునే ధోరణిలోనే ఉన్నారని, దరఖాస్తు చేయాలా? తప్పుకోవాలో అర్థం కాని అయోమయంలో ఉన్నట్లు భీమ్‍ గల్, ఆర్మూర్ ప్రాంతానికి చెందిన పది మంది కొత్త ఉత్సాహ వంతులు చెపుతున్నారు. చివరి వరకు ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని కొందరు చెపుతున్నారు.

షాపు ఎవరికొచ్చినా నడిపేది మేమే..

కొన్నేళ్లుగా మద్యం షాపుల నిర్వహణలో కాకలుదీరిన కొందరు వ్యాపారులు మాత్రం డ్రాలో తమకు షాపు వస్తదా? రాదా? అనే టెన్షనే లేనట్లు మాట్లాడుతున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో షాపులు ఎవరికి కేటాయించబడినా వాటిని నడిపేది మాత్రం మేమేనని కొందరు సిండికేట్ వ్యాపారులు ధీమాగా చెపుతున్నారు. ఎంతో కొంత గుడ్ విల్ ఇచ్చి షాపులు అనధికారికంగా తామే లీజుకు తీసుకుంటామని బహిరంగంగానే చెపుతుండడం గమనార్హం.

ఈనెల 23న షాపుల కేటాయింపు..

మద్యం షాపుల లీజుకు సంబంధించి లైసెన్స్ కేటాయించడానికి ఈనెల 23న జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ల ఆధ్వర్యంలో బహిరంగ పద్ధతిలో డ్రా పద్ధతిని నిర్వహించనున్నారు. డ్రా పద్ధతిలో షాపులు దక్కించుకున్న వారికి లైసెన్స్ జారీ చేస్తారు. షాపులు దక్కించుకున్న వారు ఈ నెల 23, 24తేదీల్లో రిటైల్ షాప్ ఎక్సైజ్ టాక్స్ ఫస్ట్ ఇన్ స్టాల్ మెంట్ చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 1న కొత్త దుకాణాలు ప్రారంభం కానున్నాయి.

Next Story