లింగంపేట మండలానికి చెందిన ఓ వ్యక్తి అదృశ్యం

by Bhanu |

ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన లింగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

లింగంపేట మండలానికి చెందిన ఓ వ్యక్తి అదృశ్యం
X

దిశ,లింగంపేట్ : ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన లింగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ముంబాజిపేట్ గ్రామానికి చెందిన పస్కూరి కాశీరాం (26) మేస్త్రి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఆదివారం సాయంత్రం భార్య భర్తల మధ్య సంసార విషయంలో గొడవ జరగడంతో చరవాణి ఇంటిదెగ్గర వదిలేసి ఇంటి నుండి వెళ్లిపోయాడు.మళ్లీ ఇంటికి తిరిగి రాకపోవడంతో బంధువులను స్నేహితులను సంప్రదించిన ఆచూకీ లభించకపోవడంతో కాశీరం భార్య రాణి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.కాశీరాం ఇంటి నుండి వెళ్ళినప్పుడు బ్లాక్ కలర్ నైట్ పెయింట్ గ్రీన్ కలర్ చొక్కా ధరించాడని తెలిపారు.

Next Story