- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం కోసం ప్రధాన మంత్రికి లేఖ
by Batti.Sumithra |
ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం కోసం డిమాండ్ చేస్తూ తెలంగాణ పసుపు రైతుల సంఘం, దక్షిణ భారత రైతు సమాఖ్య తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కోటపాటి నరసింహం నాయుడు శుక్రవారం లేఖ రాశారు.

X
దిశ ఆర్మూర్ : ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం కోసం డిమాండ్ చేస్తూ తెలంగాణ పసుపు రైతుల సంఘం, దక్షిణ భారత రైతు సమాఖ్య తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కోటపాటి నరసింహం నాయుడు శుక్రవారం లేఖ రాశారు. రైతు సాగు చట్టాలను ఉపసంహరించుకునే సందర్భంలో ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం తెస్తామని ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకో వాల్సిందిగా కోరారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం కోసం డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసే విధంగా కేంద్రం చట్టం తీసుకురావాలని అన్నారు.
Next Story






