విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడుదాం : PDSU

by Nallavelli.Anjaneyulu |

దిశ, ధర్పల్లి : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆర్మూర్ డివిజన్ మహాసభ మంగళవారం ధర్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ మహాసభకు ముఖ్య వక్తగా హాజరైన పీడీఎస్ యూ నిజామాబాద్ జిల్లా

విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడుదాం : PDSU
X

దిశ, ధర్పల్లి : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆర్మూర్ డివిజన్ మహాసభ మంగళవారం ధర్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ మహాసభకు ముఖ్య వక్తగా హాజరైన పీడీఎస్ యూ నిజామాబాద్ జిల్లా అధ్యక్షలు గౌతమ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగా ప్రైవేటు కార్పొరేట్ శక్తుల చేతులలో వెళ్తుందని లక్షల రూపాయల ఫీజులు దోపిడీ జరుగుతుందని విద్యా వ్యాపారమయం అయిందని విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 15 శాతం నిధులు విద్యారం గానికి కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఏడు శాతం నిధులు కేటాయించడం అంటే విద్య రంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గత నాలుగు సంవత్సరాలుగా తొమ్మిది వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయని వాటిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను కాపాడాలని మూసివేసిన ప్రభుత్వ బడులను ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ కష్టపడి చదివే విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేసిన పరిస్థితి ఉందని ప్రభుత్వ సంస్థలను నెలకొల్పి విద్యార్థులకు భవిష్యత్ భరోసా కల్పించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్ టి యు జిల్లా నాయకులు వి బాలయ్య, పీడీఎస్ యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్, డివిజన్ నాయకులు హుస్సేన్, రాహుల్, హనుమంత్ రెడ్డి, గణేష్ సాయి రెహమాన్ పాల్గొన్నారు.

Next Story