దేశాయి యజమాన్యం ఆర్థిక దోపిడిని ఐక్యంగా ప్రతిఘటిద్దాం : ఉర్దూఅకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హందన్..

by Ratna Kumari |

దిశ ఆర్మూర్ : దేశాయి యజమాన్యం ఆర్థిక దోపిడిని ఐక్యంగా ప్రతిఘటిద్దామని,కార్మికుల పొట్టగొడ్తున్న దేశాయి యాజమాన్యంను అరికడదామని వక్తలు మాట్లాడారు.

దేశాయి యజమాన్యం ఆర్థిక దోపిడిని ఐక్యంగా ప్రతిఘటిద్దాం : ఉర్దూఅకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హందన్..
X

దిశ, ఆర్మూర్ : దేశాయి యజమాన్యం ఆర్థిక దోపిడిని ఐక్యంగా ప్రతిఘటిద్దామని,కార్మికుల పొట్టగొడ్తున్న దేశాయి యాజమాన్యంను అరికడదామని వక్తలు మాట్లాడారు. ఆదివారం ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కుమార్ నారాయణ భవన్ లో తెలంగాణ ప్రగతిశీల భీడివర్కర్స్ యూనియన్ (టీయూసిఐ) ఆధ్వర్యంలో దేశాయి బ్రదర్స్ యాజమాన్యం ఇన్ లీగల్ గా వేయి బీడీలకు 10/- రూ. లు, బలవంతంగా తినుబండరాలను అంట‌గ‌డుతూ అమ్ముతున్న దానికి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఉర్దూఅకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హందన్,సీనియర్ కార్మిక నాయకులు బీడీకార్మిక పెడరేషన్ అధ్యక్షులు ఏ. ఎస్. పోశెట్టిలు మాట్లాడారు. దేశాయి యజమాన్యం చట్ట వ్యతిరేకంగా కార్మికులను ఆర్థికంగా 10 రూపాయల చొప్పున కోట్ల డబ్బును దోపిడీ చేయడం దారుణం అన్నారు. బీడీ పరిశ్రమలో బీడీలు చేయంచకుండ తిను బండారాలను అమ్మడం ఏ కార్మిక చట్టాలు దేశాయ్ యజమాన్యంకు అనుమతించాయని ప్రశ్నించారు. కార్మికుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దోపిడి చేస్తామంటే సాయం చేయలేదు అన్నారు. దేశాయి యజమాన్యమే కాకుండా ఏ బీడీ కంపెనీ అయినా కార్మికులపై తమ బుద్ది ప్రదర్శించి ఆర్థిక దోపిడికి పాల్పడితే సహించేది లేదన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తో పాటు , కార్మిక శాఖ మంత్రి, లేబర్ కమిషనర్ కు బృందాముగా వెళ్లి దేశాయి బ్రదర్స్ ఆర్థికంగా దోచుకున్న డబ్బులు తిరిగి చెల్లించే లాగా చర్యలు తీసుకుంటామన్నారు.

కార్మికుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని దేశాయ్ దోపిడీ చేస్తే సహించేది లేదు అని సీపీఐ(ఎం.ఎల్.)మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి. ప్రభాకర్ హెచ్చరించారు.ప్రపంచంలో ఏ రంగంలో లేని విధంగా తక్కువ పడ్డ ముడిసరుకులు తుట్టి లింపడం కేవలం బీడీ పరిశ్రమలోనే చూస్తున్న మన్నారు. ఇప్పటికైనా దేశాయి బీడీ కంపెనీ యజమాన్యం తమ అడ్డదారిలో చేస్తున్న దోపిడీని నిలిపివేయాలని, పది సంవత్సరాలనుండి చేసిన వేయికి 10 రూ. తిరిగి కార్మికులకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. TUCI జిల్లా అధ్యక్షులు M. ముత్తేన్న అధ్యక్షత వహించిన‌ ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర విత్తనా భివృద్ధి చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ విఠల్ రావు, ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి. రామకృష్ణ, ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి. దేవారం, సీఐటీయూ ప్రధానకార్యదర్శి నూర్ జాన్, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, టియుసిఐ జిల్లా అధ్యక్షులు ఎం. ముత్తేన్న, ప్రధాన కార్యదర్శి ఆర్. రమేష్, ఉపాధ్యక్షులు వి. సత్తేవ్వ, కె. రాజేశ్వర్, ఏఐటీయూసీ నాయకులు బాబురావ్ పాల్గొన్నారు.

Next Story