- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలి
న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కామారెడ్డి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అతిమాముల శ్రీధర్ గుప్తా విజ్ఞప్తి చేశారు.

దిశ, బిక్కనూరు : న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కామారెడ్డి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అతిమాముల శ్రీధర్ గుప్తా విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన భిక్కనూరు మండల కేంద్రంలో తెలంగాణ న్యాయవాదుల బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన డి జగదీశ్వర్ రావు ను మర్యాదపూర్వకంగా కలసి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా న్యాయవాదుల సంక్షేమం, కోర్టులో సదుపాయాలు మెరుగుపరిచే విధంగా కృషి చేయాలని, వృత్తిపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు స్వీకరించిన ఆయన తోటి న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జగదీశ్వరరావు న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని భరోసానిచ్చారు.






