గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలి

by Ratna Kumari |

మండలంలోని తాండూరు గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటైన అక్కంపల్లి గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి అధికారులు స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ శనివారం అక్కంపల్లి గ్రామస్తులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలి
X

దిశ, నాగిరెడ్డిపేట్ : మండలంలోని తాండూరు గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా ఏర్పాటైన అక్కంపల్లి గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి అధికారులు స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ శనివారం అక్కంపల్లి గ్రామస్తులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ వెంకాగౌడ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు తహ‌శీల్దార్ కార్యాలయానికి తరలివచ్చి కార్యాలయం ఆవరణలో ఆర్డిఓ రావాలంటూ, గ్రామపంచాయతీకి స్థలాన్ని కేటాయించాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని తాండూర్ గ్రామపంచాయతీ పరిధిలో అక్కంపల్లి కిచ్చన్నపేట గ్రామాలు ఉండగా.. ప్రభుత్వం అక్కంపల్లి గ్రామాన్ని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది. నూతన గ్రామపంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలన్నారు. అక్కంపల్లి గ్రామ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 91/1 లో ఉన్న ప్రభుత్వ భూమిని కిచన్నపేట గ్రామస్తులు వినియోగించుకుంటున్నారని, అన్ని అధికారులు స్వాధీనం చేసుకొని అక్కంపల్లి గ్రామ పంచాయతీ భవనం తో పాటు గ్రామం మహిళా సంఘం భవన నిర్మాణాలకు స్థలాన్ని కేటాయించాలని అధికారులను కోరారు. సంఘటన స్థలానికి స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్, పోలీస్ సిబ్బందితో వచ్చి నిరసన కార్యక్రమాన్ని విరమించాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం గ్రామస్తులు ఇన్ చార్జి త‌హ‌శీల్దార్ రాజేశ్వర్, ఇన్ చార్జి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ లకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఇన్ చార్జి తహ‌శీల్దార్ రాజేశ్వర్ గ్రామస్తులతో మాట్లాడుతూ ఈ సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని గ్రామస్తులకు తెలిపారు. దీంతో వారు తమ ఆందోళనను విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట్ గౌడ్, నాయకులు బండ బాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story