'మీ సేవ'లపై జిల్లా అధికారుల పర్యవేక్షణ కరువు

by Nallavelli.Anjaneyulu |

దిశ, కమ్మర్ పల్లి : ' మీ సేవ' కేంద్రాలపై తనిఖీ నిర్వహించి పై అధికారులకు నివేదిక పంపించిన జిల్లా స్థాయి అధికారుల చర్యలు శూన్యం. కమ్మర్

మీ సేవలపై జిల్లా అధికారుల పర్యవేక్షణ కరువు
X

దిశ, కమ్మర్ పల్లి : ' మీ సేవ' కేంద్రాలపై తనిఖీ నిర్వహించి పై అధికారులకు నివేదిక పంపించిన జిల్లా స్థాయి అధికారుల చర్యలు శూన్యం. కమ్మర్ పల్లి మండల కేంద్రంలో ఉన్న‌ 3 మీ సేవ కేంద్రాలపై సెప్టెంబర్ 16 స్థానిక రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించి నివేదిక జిల్లా స్థాయి అధికారులకు పంపించినట్లు తెలిపారు. తనిఖీ నిర్వహించి దాదాపు 20 రోజులు కావస్తున్న జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఆదివారం దిశ పేపర్ లో 'మీసేవ సెంటర్' లో ఆగని అక్రమ వసూళ్ల దందా..! అనే కథనం ప్రచురితమైంది. మండలంలో 10 మీసేవ కేంద్రాలను తనిఖీ విషయమై తాసిల్దార్ జి .ప్రసాద్ ను వివరణ కోరగా.. గత 20 రోజుల క్రితమే మండల కేంద్రంలోని 3 మీ సేవ కేంద్రాల నివేదికలు పై స్థాయి అధికారులకు పంపించామని, మిగిలిన 7 మీ సేవ కేంద్రాలను తనిఖీ నిర్వహించి నివేదిక పై స్థాయి అధికారులకు పంపించినట్లు తెలిపారు. 10 మీ సేవ కేంద్రాలపై చర్యలు జిల్లా స్థాయి అధికారులు తీసుకుంటారని త‌హ‌శీల్దార్ తెలిపారు.

Next Story