ఫోన్ పే లో పొర‌పాటున వ‌చ్చిన డ‌బ్బుల‌ను తిరిగి పంపించిన మ‌హిళ‌కు అభినంద‌న‌లు

by Ratna Kumari |

దిశ, ఆర్మూర్ : ఫోన్ పే లో ఒకరికి బదులు మ‌రొక‌రికీ రూ.66వేలు హైదరాబాద్ అశోక్ నగర్ కు చెందిన గిరి విజయలక్ష్మి పంపారు. అయితే గిరి విజయలక్ష్మి ఆమె స్నేహితురాలుకి రూ.66వేలు

ఫోన్ పే లో పొర‌పాటున వ‌చ్చిన డ‌బ్బుల‌ను తిరిగి పంపించిన మ‌హిళ‌కు అభినంద‌న‌లు
X

దిశ, ఆర్మూర్ : ఫోన్ పే లో ఒకరికి బదులు మ‌రొక‌రికీ రూ.66వేలు హైదరాబాద్ అశోక్ నగర్ కు చెందిన గిరి విజయలక్ష్మి పంపారు. అయితే గిరి విజయలక్ష్మి ఆమె స్నేహితురాలుకి రూ.66వేలు పంపించ‌గా.. తన స్నేహితులకు తన సెల్ ఫోన్ నెంబర్ 9848321289 బదులుగా సెల్ ఫోన్ నెంబర్ 9848321389 నెంబ‌ర్ కి 66,000/- పంపించింది. అయితే సెల్ నెంబర్ చెక్ చేసుకోగా ఆ సెల్ నెంబర్ నూతుల సత్తమ్మ ఆర్మూర్ కు చెందిన మహిళ ఫోన్ నెంబర్ అని తెలుసుకొని గురువారం ఆర్మూర్ లోని ACP వెంకటేశ్వర రెడ్డి వద్దకు వచ్చి హైదరాబాద్ గిరి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు కలిశారు. దీంతో ACP ఆర్మూర్, ఆర్మూర్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గౌడ్ ద్వారా నూతుల సత్తమ్మను పిలిపించి విచారించగా సత్తమ్మ తనకు పొరపాటున రూపాయలు 66,000/- తన అక్కౌంట్ లోకి వచ్చినట్లు తెలిపింది. నూతుల సత్తమ్మ తిరిగి గిరి విజయ లక్ష్మి కి ఫోన్ పే ద్వారా 66,000/- వేల రూపాయలను చెల్లించింది. ACP ఆర్మూర్ వెంకటేశ్వర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆర్మూర్ సత్యనారాయణ గౌడ్ లతోపాటు ఆర్మూర్ పట్టణంలోని పలువురు ప్రముఖులు నూతుల సత్తమ్మ ను అబినందించినారు.

Next Story