గిరిజనుల హక్కుల సాధన కోసం పోరాడిన వీరుడు కొమురంభీం : పెంకటి గణేష్

by Nallavelli.Anjaneyulu |

దిశ, బాన్సువాడ : గిరిజనుల హక్కుల సాధన కొరకు తన జీవితాంతం పోరాడిన గోండు వీరుడు కొమురం భీం అని నాయక్​పోడ్​ సంఘం జిల్లా

గిరిజనుల హక్కుల సాధన కోసం పోరాడిన వీరుడు కొమురంభీం : పెంకటి గణేష్
X

దిశ, బాన్సువాడ : గిరిజనుల హక్కుల సాధన కొరకు తన జీవితాంతం పోరాడిన గోండు వీరుడు కొమురం భీం అని నాయక్​పోడ్​ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పెంకటి గణేష్​ అన్నారు. బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామంలో మంగళవారం ఆదివాసీ నాయకులు, గిరిజన సంఘ సభ్యుల ఆధ్వర్యంలో కొమురంభీం 85 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజనుల హక్కుల కొరకు జీవితాంతం పోరాడిన వీరుడు కొమురంభీం అని నాయక్​పోడ్​ సంఘం కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పెంకటి గణేష్​ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెంకటి గణేష్ మాట్లాడుతూ.. జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆడబిడ్డల హక్కుల కోసం, గిరిజనుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గోండు వీరుడు కొమురం భీం అనిఅన్నారు. ఆయన దేశానికి గర్వకారణమని, గిరిజనుల ఆత్మగౌరవ ఉద్యమాలకు మార్గదర్శకుడని తెల్పారు. ఆ విప్లవ వీరునికి జోహార్లు అంటూ నినదించారు. కార్యక్రమంలో మాజీ ప్రధాన కార్యదర్శి కొంకి గణేష్, సంఘ అధ్యక్షుడు కొంకి సాయిలు,సభ్యులు గంగాధర్, పోచయ్య, శుభాష్, చిరంజీవి, రాజు,లింగం, ప్రవీణ్, సాయిరాం, శ్రీకాంత్ పాల్గొన్నారు.

Next Story