- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిల్వ చేసేందుకు చోటెక్కడా..?
దిశ, భిక్కనూరు : కేంద్ర ప్రభుత్వం గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని లిఫ్ట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న

లిఫ్ట్ చేయడంలో నిర్లక్ష్యం వల్లే..
ఖరీఫ్ లో మొత్తం 10వేల ఎస్కె ల బియ్యం ప్రభుత్వం లిఫ్ట్ చేయాల్సి ఉండగా, కేవలం 60 శాతం మాత్రమే లిఫ్ట్ చేయగా, సుమారు సుమారు 4వేల ఎస్కెల ధాన్యం బ్యాలెన్స్ గా మిగిలిపోయింది. ఒక్క ఎస్ కె లో 290 క్వింటాళ్ల ధాన్యం రవాణా అవుతోంది, అయితే గత రబీ సీజన్ లో 8900 ఎస్కెలకు గాను కేవలం 22 వందల ఎస్కెల ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం మి ల్లర్లనుంచి నుంచి లిఫ్ట్ చేయగా, మిగతా 6700 ఎస్కెల బియ్యం అలాగే ఉండిపోయింది. ఈ విధంగా మిల్లులలో స్టాక్ ములుగుతున్నప్పటికీ, ప్రభుత్వం పట్టించుకోకపోవడం మిల్లర్లకు తలనొప్పిగా మారింది. ఇక సన్నాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. గత రబీలో 20 శాతం మాత్రమే సన్నాలను లిఫ్ట్ చేయగా, మిగతా 80 శాతం సన్న రకం ధాన్యం అలాగే నిల్వ ఉండిపోయింది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలా, లేక అధికారులకు అవగాహన లేకపోవడం ఏమో తెలియదు కాని జిల్లావ్యాప్తంగా మిల్లర్లు ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారు.
మంత్రి ఉత్తమ్ ను కలసిన మిల్లర్లు..
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్త మ్ కు మార్ రెడ్డి ని జిల్లా రైస్ మిల్లర్లు మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో కలిశారు. మిల్లులలో నిల్వ ఉన్న ధాన్యాన్ని తొందరగా లిఫ్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మంత్రి కూడా రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య నెలకొందని, వెంటనే ఎస్కెలు నింపే అధికారులకు ఫోన్ చేసి, ధాన్యం లిఫ్ట్ చేసే విధంగా చూడాలని సూచించారు. అంతేకాకుండా వారు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి న్యాయం జరిగేలా చూస్తానని మిల్లర్లకు మంత్రి ఉత్తమ్ భరోసా ఇచ్చారు.






