- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై కేసీఆర్ సన్నాహక సమావేశం
బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ మహాసభ వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన విషయం నేపథ్యంలో బుధవారం రెండు ఉమ్మడి జిల్లాల నాయకులతో టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సన్నాక సమావేశాన్ని నిర్వహించారు.

దిశ,ఆర్మూర్: భారత రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎర్రవెల్లిలోని నివాసంలో సన్నాహక సమవేశం నిర్వహించారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల ముఖ్యనేతలు సమావేశానికి హాజరయ్యారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల ముఖ్యనేతలతో బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు సిద్దిపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు కె. ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు చింత ప్రభాకర్, మాణిక్ రావు, మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరీ సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, పార్టీ నేతలు జైపాల్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ బిగాల గుప్త, గంప గోవర్ధన్, జాజుల సురేందర్, హనుమంత్ షిండే, నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అశన్న గారిజీవన్ రెడ్డి, కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజీబుద్దీన్, ఆయేషా షకీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.






