- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవిత, సీఎం రేవంత్ రెడ్డిలు బిజినెస్ పార్టనర్స్.. ఎంపీ అర్వింద్ సంచలన ఆరోపణలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇద్దరు వ్యాపార భాగస్వాములని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి సంచలన ఆరోపణలు చేశారు. ఈ

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇద్దరు వ్యాపార భాగస్వాములని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం కావాలంటే గూగుల్ కూడా చెబుతుందన్నారు. నిజామాబాద్ లోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త లతో కలిసి ఎంపీ అర్వింద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ జాగృతి అధ్యక్షురాలు కవిత, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో కవితకు బిజినెస్ పార్టనర్ షిఫ్ ఉందని, అందుకే కవిత తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించడం లేదని ఎంపీ అర్వింద్ అన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి చెంచాగిరీ చేస్తున్నారని అర్వింద్ విమర్శించారు. తన స్థాయికి తగిన రీతిలో వ్యవహరించాలని శాసన మండలి చైర్మన్ గుత్తాకు అర్వింద్ సూచించారు.
పేద విద్యార్థుల చదువును కేసీఆర్ కుటుంబం జీర్ణించుకోదు..
బీసీ, ఎస్ సీ, ఎస్ టీ విద్యార్థులు చదువుకుంటే, మంచి ఉద్యోగాలు వస్తే కల్వకుంట్ల కుటుంబం సహించదని అర్వింద్ అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఒక జనరేషన్ చదువులను కేసీఆర్ కుటుంబం అణగదొక్కిందన్నారు. కొవ్వు బాగా మెదడుకెక్కిన కుటుంబం కాబట్టే కేసీఆర్ కుటుంబ పార్టీ బీఆర్ఎస్ ను ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బండకేసి ఉతికారని అర్వింద్ అన్నారు. పచ్చకామెర్లున్నోళ్‌లకు ప్రపంచం పచ్చగ కనిపిస్తుందని కవిత నోరు జారిందన్నారు. నువ్వు చేసిన అవినీతి అందరు చేస్తారని అనుకోవద్దని కవితనుద్దేశించి అన్నారు. మాధవనగర్ ఫ్లై ఓవర్ కు నీ బిజినెస్ పార్టనర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వడం లేదని అర్వింద్ అన్నారు. భయానికి కాంట్రాక్టర్లు పారిపోయారని, నీ దిక్కుమాలిన చరిత్ర ప్రజల ముందు పెట్టాను గనకే నీకు ఈ గతి పట్టిందని కవితనుద్దేశించి అర్వింద్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ పెట్టించే కార్యక్రమం చేస్తున్న కవిత కు బీసీ, ఎస్సీ, ఎస్టీ , ఆర్యవైశ్య కులాలే కాదు ఆ కులాలు, ఈ కులాలు కాదు, వెలమ కులపోళ్లు కూడా ఓటేయరన్నారు. నీ బిజినెస్ పార్టనర్ రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించాలని, ఆయనతో రాజీనామా చేయిస్తే బీసీ బిల్లు వస్తదని కవితకు సూచించారు. నిన్ను మీ అయ్య వెళ్లగొడతాడు.. మీ అన్న నిన్ను దగ్గరకు రానివ్వడు.. కవిత ఆ ప్రస్టేషన్ అంతా బీజేపీ మీద తీస్తోందని అర్వింద్ అన్నారు.
మున్సిపాలిటీలకు రూ. 169.3 కోట్లు
నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఆరు మున్సిపాలిటీలకు రూ.169.3 కోట్లు మంజూరైనట్లు ఎంపీ అర్వింద్ తెలిపారు. ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవేనని ఎంపీ గుర్తు చేశారు. 80 శాతం రాష్ట్రం కేవలం 20 శాతం నిధులు మాత్రమే ఇచ్చిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం తమ నిధులని, తామే ఆ నిధులను తెచ్చామంటూ నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటుందని అర్వింద్ విమర్శించారు. ఆర్వోబీ నిధుల కేటాయింపుపై మాధవ నగర్ ఆర్ఓబి వద్ద దీక్ష చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని అర్వింద్ స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త పాల్గొన్నారు.






