- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిజర్వేషన్లు మహిళలకు.. అధికారాలు భర్తలకు..?
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా... ప్రభుత్వమే మాదాయే...మేం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారేమో స్థానిక నాయకులు కొందరు.

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో అధికార కాంగ్రెస్ నాయకులు నిబంధనలను తేలిగ్గా తీసుకుంటున్నారని ప్రత్యక్షంగా కనిపిస్తోంది. చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ధర్మగోని లక్ష్మీని ఇటీవల కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్‌గా ప్రభుత్వం నియమించింది. అయితే, ఆమె హాజరుకావాల్సిన అధికారిక కార్యక్రమాల్లో ఆమె భర్త రాజా గౌడ్ పాల్గొంటుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బుధవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పాత రాజంపేటలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ధర్మగోని లక్ష్మీకి బదులు ఆమె భర్త రాజా గౌడ్ ప్రారంభించారు. దీంతో అక్కడున్న రైతులతో పాటు నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతుంటే స్థానికంగా మహిళలకు బదులు వారి భర్తలే పెత్తనం చెలాయిస్తున్నారు. దీంతో ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు వృధాగానే అయిపోతున్నాయి అనడానికి ఇదో నిలువెత్తు సాక్ష్యం.






