డీసీఎం ఢీ కొన్న ఘ‌ట‌న‌లో చికిత్స పొందుతూ మేక‌ల కాప‌రి మృతి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-06-12 15:26:23  IST  )

ఎల్లారెడ్డి మండలం కొట్టాల్ గ్రామ స్టేజి వద్ద శుక్రవారం ఉదయం డీసీఎం వ్యాన్ ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మేకల కాపరి ఆలకుంట శివయ్య చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎల్లారెడ్డి ఎస్ఐ రాజు తెలిపారు.

డీసీఎం ఢీ కొన్న ఘ‌ట‌న‌లో చికిత్స పొందుతూ మేక‌ల కాప‌రి మృతి
X
దిశ‌, లింగంపేట : ఎల్లారెడ్డి మండలం కొట్టాల్ గ్రామ స్టేజి వద్ద శుక్రవారం ఉదయం డీసీఎం వ్యాన్ ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మేకల కాపరి ఆలకుంట శివయ్య చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎల్లారెడ్డి ఎస్ఐ రాజు తెలిపారు. కొట్టాల గ్రామ స్టేజి వద్ద శుక్రవారం ఉదయం డీసీఎం వ్యాన్ డీ కొట్టడంతో 20 మేకలు మృతి చెందగా.. మేకల కాపరి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన మేకల కాపరి ఆలకుంట శివయ్య ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చెప్పారు. మృతుని భార్య పోచవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన డీసీఎం వ్యాన్ డ్రైవర్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story