కల్లెడ విద్యార్థిని తేజశ్రీ కి రాష్ట్రస్థాయి కబడ్డీ కి ఎంపిక

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఆలూర్ : నిజామాబాద్‌ జిల్లాకు గర్వకారణంగా కల్లెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పి. తేజశ్రీ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌–జూనియర్ బాలికల కబడ్డీ జట్టులో చోటు

కల్లెడ విద్యార్థిని తేజశ్రీ కి రాష్ట్రస్థాయి కబడ్డీ కి ఎంపిక
X

దిశ, ఆలూర్ : నిజామాబాద్‌ జిల్లాకు గర్వకారణంగా కల్లెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పి. తేజశ్రీ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌–జూనియర్ బాలికల కబడ్డీ జట్టులో చోటు దక్కించుకుంది. అక్టోబ‌ర్ 14న కలెక్టర్‌ గ్రౌండ్స్‌లో జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సబ్‌–జూనియర్ గర్ల్స్ మరియు బాయ్స్ కబడ్డీ జట్ల ఎంపికలో తేజశ్రీ అద్భుతమైన‌ ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపికైంది. ఆమె ఈనెల 16న ప్రారంభమయ్యే సంగారెడ్డి జిల్లాలో నిర్వహించబోయే SGF రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొననుంది. విద్యార్థిని విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు, పీడీ పింజ సురేందర్‌తో పాటు ఉపాధ్యాయ బృందం, గ్రామ ప్రజాప్రతినిధులు, విఎడీసీ సభ్యులు, యువజన నాయకులు ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తేజశ్రీ చేసిన కృషి పట్ల గర్వంగా ఉందని, ఆమె రాష్ట్ర స్థాయిలో విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.

Next Story